Thursday, October 15, 2009

అమెరికా చిత్రాలు

ఇప్పుడు మనం ఆ కప్పని తిందాం ! ఏంటీ, మొదటి టపా కి వచ్చిన కల్లెక్షన్లు- వ్యాఖ్యలు చూసి నాకు కొంచెం... అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఇది ఒక పుస్తకం(Eat That Frog) పేరు. ఈ మధ్యనే ఎవరో బ్లాగ్ లో దాన్ని పరిచయం కూడా చేసారు. ఈ పుస్తకపాఠం ఏంటంటే , ఎప్పుడూ మనకు అతి కష్టమైన పనిని మొదటగా చేసేయ్యాలి. నాకు అమెరికా అనుభవాల్లొ అతి ముఖ్యమైన మరియూ, జనాలకి అతి కష్టమైన విషయాన్ని మొట్టమొదటగా చెప్పేసుకుందాం అని నా కవిహృదయం.



మాది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవ్వటం వల్లనూ, అంతకుముందే చాలా మంది అక్కడికి మాలాగే మూడు నెల్ల ఆన్ సైట్ వెళ్ళివచ్చి వుండడం వల్లనూ, అక్కడికి ఎవరు వెళ్ళినా ఏం చేయాలి అన్న ఒక మాదిరి(template) మేమెళ్ళేసరికే రెడీగా ఉంది. ఓహ్! అసలు సంగతి చెప్పలేదు కదా, మేమెళ్ళింది సియాటిల్,WA కి. మొదట వాషింగ్టన్ DC ఏమో అనుకుని తెగ ఆవేశపడిపొయాను. కాని, ఎక్కడో అక్కడికి, అమెరికా అంటూ వెళ్ళ్తున్నాం కదా! సరె, వెళ్ళగానే మా సీనియర్స్(అంటె, రెండోసారి వచ్చినవాళ్ళు) చెప్పారు- మొదటి వీకెండు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతె, బస్ రూట్ లూ అవీ తెలుసుకోవాలి. రెండో వీకెండ్ నుంచి సియాటిల్ సిటీ టూర్ అని ఉంటాది, అది ఫినిష్ చెయ్యాలి. ఇది ఐదు ప్లేసెస్ కి కలిపి ఒక పేకేజ్ టూర్ అన్నమాట. అసలు అన్నింటికన్నా ముందు మనకి ఒక కెమేరా ఉండాలి. ఎందుకు??? ఎందుకేంటి?(టపా పేరు చూడలేదా?) అసలు అమెరికా వచ్చినవాడెవడైనా ఇక్కడ చిత్రాలు/బొమ్మలు/అచ్చతెలుగులో-ఫొటోలు తీసుకోకుండా ఉంటాడా? కెమేరా లేకుండా కాలు బయటకి పెడతాడా? ఫొటోలు లేకపొతె నువ్వుస్సలు అమెరికా వెళ్ళొచ్చినట్టు గేరంటీ ఏంటి? .......... అని బాగా గడ్డి పెట్టాక, డౌట్ డౌట్ గానే నా దగ్గర ఉన్న కెమేరా తీసాను. ఇది ఓకెనా? హ్మ్మ్, ఇది చాలా ఓల్డ్ మోడల్(ఆర్నెల్ల క్రితం మా టీమ్మేట్ తొ తెప్పించాను) 512mb అంటె 250 ఫొటోలు మాత్రమే పడతాయి, వేరే కెమేరా కూడా చూడండి. ముగ్గురికి కనీసం రెండు కెమేరాలైనా ఉంటె మంచిది.



సరే, ఆ సీనియర్ దగ్గరే, ఇంకో కెమేరా అప్పు తీసుకుని, రెండూ ఫుల్ల్ చార్జింగ్ పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరాం. మా ఫ్లాట్ నుంచి ముగ్గురు, పక్క ఫ్లాట్ నుంచి ఇద్దరు (వీళ్ళకి వేరే కెమేరా ఉంది). సీనియర్స్ మాతో రారు వాళ్ళు ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ చూసేసారు. అందరం ట్రింగా రెడీ అయ్యి, బాక్పాక్ లో గొడుగు, పులియొగరె డబ్బా, డైట్ కోక్ టిన్ను, MP3/ఐపోడ్ etc.. తొ బస్ స్టాప్ కి వచ్చాం. రాగానె, రోజూచూసె బస్ స్టాప్ చాలా కొత్తగా కనపడింది. వెంఠనే అందరం, విలన్ని చూడగానె డిటెక్టివ్ గన్ తీసినట్టు, వాళ్ళ వాళ్ళ కెమేరాలు పౌచ్ లోంచి బయటకి తీసాం. క్లిక్ క్లిక్ క్లిక్ క్లిక్ క్లిక్... ఐదుగురు అమ్మాయిలు ఐదు ఫొటోలు విత్ అమెరికన్ బస్ స్టాప్. అంతే, అక్కడనుంచి, ప్రతి చెట్టుతొ, పుట్టతొ, ఆక్వేరియంలో చేపలతొ, అల్ల్చిప్పలతొ, క్రూజ్ లో షిప్ తొ, షిప్ నడిపే కేప్టెన్ తొ, షిప్ తుడిచె స్టీవార్డ్ తొ, సియాటిల్ స్పేస్ నీడిల్ తొ, పసిఫిక్ సైన్స్ సెంటర్లో సబ్బు బుడగలతొ, నీటి ధారలతొ, రోడ్డు మీద పూలతొట్టెలతొ, చెత్తబుట్టలతొ, కాదేదీ ఫొటోకనర్హం అని శ్రీ శ్రీ గారిని గుర్తు చేసుకుంటూ..... పైగా అన్ని ఫొటోలూ ఐదు సార్లు. అంటే, ఇప్పుడు రోడ్ మీద ఒక పూలతొట్టి ఉంది అనుకోండి, వెంటనే దాని పక్కన నెను, క్లిక్ తర్వాత అదే ప్లేస్లో ఆరతి, క్లిక్ తర్వాత షై, క్లిక్ etc.... అలా అన్నమాట. ఒక్కోసారి అమెరికన్స్ కొంతమంది మా గ్రూప్కి కలిపి ఫొటో తీస్తాం అని హెల్ప్ చేసేవారు, ఒక్కోసారి నవ్వుకునేవాళ్ళు లేదా మమ్మల్ని వింతగా చూసేవాళ్ళు, ఐనా మేమెక్కడా తగ్గలేదు. బోడి, వాళ్ళకు మేం వింతైతే వాళ్ళబట్టలూ, జుట్లూ, కంపూ మాకూ వింతే మరి హూం!



ఇక తర్వాత వీకెండ్ జూ, ఫ్లైట్ మ్యుజియం. ఇవి ఐపోతె, సిటి టూర్ ఐపోయినట్లె. ముందు జూ కి బయలుదేరాం. యధావిధిగా, అన్ని కేజులతొ, పాములతొ, తొండలతొ, పిట్టలతొ ఫొటోలు తీసుకుంటూ వెళ్తున్నాము. ఒక దగ్గర మంకీస్ ఉన్నాయి. చాలా హుషారుగా ఇకిలిస్తూ ఫీట్లు చేస్తున్నాయి. అందరం ఫొటోలు దిగాము. నెక్ష్ట్ ఏదొ పిట్టలు మళ్ళీ.. కాని సరిగ్గా కనిపించట్లేదు. ఆకుల్లొంచి నల్లటి బలమైన బీక్ మాత్రం కనిపిస్తుంది. ఏదో ఒకటిలే, అస్సలే ఐదుగురం ఫొటోలు తీసుకోవాలి అని అందరం దిగేసాం. బర్డ్ కేజ్ అవతలవైపు దాని నేం బోర్డ్ ఉంది అని చూడ్డానికి వెళ్ళాం..... అందరం ఫ్రీజ్ ఐపోయాము కొంతసేపు. అక్కడ వంకరగా వేలాడుతున్న బోర్డ్ మీద బోల్డ్ అక్షరాల్లో ఉంది- INDIAN CROW !!! ఒక్క క్షణంలో తేరుకుని అందరూ చక చకా కెమేరాలో ఇందాక తీసిన ఫొటోలు డిలీట్ చేసేసాం. ఇంత బతుకూ బతికి, అమెరికాకొచ్చి...హూం! అందరూ ముందుకి నడిచారు, నాకు ఎందుకో చిన్న అనుమానం మొదలైంది. మీరు వెళ్తుండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇందాక చూసిన మంకీ దగ్గరకు వెళ్ళాను. అది మళ్ళీ ఆనందంగా గంతులు వెయ్యటం మొదలెట్టింది, నా అనుమానం పెరుగుతూ పోయింది...అటు వైపు వెళ్ళి బోర్డ్ చూసాను............... !!!


ఇలా, సియాటిల్ లో తిరిగిన ప్రతీ చోటా రెండొందలకి తక్కువకాకుండా ఫొటోలు తీసుకున్నాం. సీనియర్లు శెభాష్! అన్నారు. సిటీ టూర్ తరువాత, రూం లో అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. అక్కడ సెట్టిల్ ఐపొయిన మనవాళ్ళు ఇక్కడికీ అక్కడికీ కారుల్లొ తిప్పేవారు. కాని, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో వెళ్ళినా వెంట కెమేరా లేకుండా మాత్రం కదిలే వాళ్ళం కాదు. మళ్ళి, ఇండియా కి బయల్దేరే సరికి నా ఫొటోలు కేవలం 4 GB అయ్యాయి(అసలు నా కౌంట్ చాలా ఏవరేజ్ మిగతావాల్లతొ పోలిస్తే). సరే, ఇంటికి వచ్చాక, అమ్మా నా అమెరికా ఫొటోలు చూపిస్తాను అని కూర్చొపెట్టాను.



1..2..3..అబ్బ భలే ఉన్నాయి



10...20...25 ఊ.. ఆన్నిట్లోనీ నువ్వే కదా (లేకపొతె, పక్క వాళ్ళవి చూపిస్తానా ఏంటి)



పోని, ఇవి చూడమ్మా, ఇందులో నేను లేను, అన్ని సీనరీస్ ఉన్నాయి. మంచు, ఫాల్ కలర్స్, కొండలు... అసలు నువ్వేలేకుండా ఫొటో ఎందుకే?



ఇలాక్కాదు గాని, డాడీ ని కేచ్ పడదాం.... డాడీ మన కుటుంబంలో ఒకరు, అందులోనూ ఒక అమ్మాయి మొదటిసారి అమెరికా వెళ్ళింది కదా, ఔను. మరి ఆ సంతోషం మీరు పంచుకోవాలికదా, ఔను. కాబట్టి నా ఫొటోలు చూడండి. అబ్బా, నాకీ కంప్యుటలో అసలు అర్ధం కావమ్మా, ఒక మంచి ఫొటోలు నాలుగు, నువ్వు ఫెయిర్ గా ఉన్నవి కడిగించి ఇవ్వు, పనికొస్తాయి.(గ్ర్ర్... ! నాకు తెలీదా ఎందుకో)



హ్మ్మ్... ఈ పెద్దవాళ్ళకి అతితెలివి ఎక్కువైపోతుంది. ఈసారి పిల్లల్ని(మా అక్క కూతుర్లు) ట్రై చేద్దాం...



బ్లెస్సితల్లీ, నిస్సిబంగారం, ఇలా రండమ్మా... నేను అమెరికా నుంచి మీకు బట్టలూ, బొమ్మలూ, చాక్లెట్లూ తెచ్చానుకదా, మరి మీరు అమెరికా ఎలా ఉంటుందో చూడరా?



నువ్వు ఏ ఊరు వెళ్ళావ్?... అమెరికా.



డాడీ ఏ ఊరు వెళ్ళారు?... లండన్ (మా బావగారు అప్పుడు UK లో ఉన్నారు).



అంటే అది డాడీ వాళ్ళ ఊరు కాదా? ...కాదు... ఐతే, మాకొద్దు ఫొ!



*



*



*



*



*



ఒకటిన్నర సంవత్సరాల తరువాత....



అప్పారావ్... ఎంటి చిన్ని,



మీకొ స్వీట్ సర్ప్రైజ్ !... హ్మ్మ్ ఏంటది?



ఒక బ్లాక్ CD కేస్... హనీమూన్ ఫొటోలా?



కాదు, నా అమెరికా ట్రిప్ ఫొటోలు... అల్బం చేయించాలా?



ఖాదు, జుస్ఠ్ ఛూస్తే ఛాలు !!! .... ఇంత లైవ్లీ గా నువ్వే నా ముందు ఉండగా ప్రాణంలేని ఫొటోలు ఎందుకు చెప్పు?


నాకు తెలీదనుకున్నరా? మీ నాటకాలు? బాబీగాడు మీకు ముందే చెప్పేసాడుకదా ఈ ఫొటోల గురించి? ఎట్టిపరిస్థితుల్లోను వాటిగురించి కమ్మిట్ అవ్వొద్దని? అస్సలు నేను ఎవ్వరికీ చూపించను నా ఫొటోలు. మీరు అడిగినా సరే. హూం!!!



.........ఏమనుకుంటున్నారో నిజంగానే మీరు ఎవరు అడిగినా సరే చూపించనంతె !



17 comments:

బృహఃస్పతి said...

:-) :-) :-) :-)

నిరాశపరచలేదు మీ అమెరికా అనుభవాలు
:-) :-) :-) :-)

భావన said...

ఇది ఇండియా నుంచి షార్ట్ టైం కు వచ్చినవాళ్ళకే కాదు ఇక్కడ కూడా కొందరికి వుంటుంది అనుకుంటా.. నా ఇండియా ఫ్రెండ్ ఒక ఆయన అన్నారు మా ఇంట్లో మా ఫొటో ల కంటే అమెరికా వాళ్ళ ఫుంక్షన్స్ అండ్ వాళ్ళ వూరి విశేషాలు వున్న ఫొటో లు ఎక్కువ అని. బాగుంది ఇలా ఒక ఆల్బం చేసుకుని తిరుగు తున్నారన్నమాట. ప్లీజ్ ప్లీజ్ మాకు చూపించరు... సరదా గావున్నాయి కబుర్లు. మరిన్ని విశేషాల కోసం చూస్తుంటాము. థ్యాంక్స్ కలర్ మార్చి ఫాంట్ పెద్దది చేసేరు.. చదవటానికి ఈజీ గా వుంది.

Bhãskar Rãmarãju said...

:):)
అన్నట్టు కవిహృదయమా? కవయత్రిహృదయమా? :):)

నేను మొట్టమొదటిసారి అమెరికాకి ఆన్సైట్ వచ్చినప్పుడు, కేవలం రెండురీళ్ళు మాత్రమే తీసా మూడూనెలలకి కలిపి. అంతకముందు ఇటలీ వెళ్ళినప్పుడు, వెళ్ళిన మొదటి రోజే నాలుగు రీళ్ళు అయిపొయ్యాయి. :):)
ఎవురోకరు దొరుకుతార్లేండి తర్వాతర్వాత, సూపించొచ్చు. లేకపోతే ఆల్బం మొత్తం సెప్పే కత్తో[అనగా కధతో] పాటు కనక సూత్తే ఓ నాలుగు డాలర్లు ఇవ్వబడును అని ఓ ఫ్లైయర్ తయ్యారుసేసి పెట్టండి..

మంచు said...

అదరగొడుతున్నారు కదా.. ఇంటికి వచ్చాక సంగతులు ఇంకా బాగున్నయ్..

Sravya V said...

:)

sunita said...

Hahaha!!Funny!

Ruth said...

@బృహఃస్పతి గారు, చాలా వందనాలు :)
@భావన గారు, షార్ట్ టైం ఐనా లాంగ్ టైం ఐనా, వచ్చిన కొత్తలో అలానే ఉంటాదేమొనండి.
@భాస్కర్ గారు, హృదయానికి కవి/కవయిత్రి ఏంటండి? ఏదొ మా సైడ్ స్లాంగ్లో అలానే అంటాం :)
ఐనా మీరు 'రీళ్ళూ అంటున్నారేంటి???
@ మంచు పల్లకీ గారు, అదెకదా నా బాధంతా! వెళ్ళేవరకు ఎప్పుడు వెళ్ళ్తవ్ అని చంపేసారు, తీరా వెళ్ళివచ్చాక అందరూ లైట్ తీసుకోడమే!
@ శ్రావ్య & సునిత, థాంక్స్ :)

Bhãskar Rãmarãju said...

అంత టెక్నాలజీ ఇంకా లేదు అప్పట్లో, పాతకాలం మనుషులం :):)
నా మొట్టమొదటి ఆన్సైట్ - 2000.
[అందరికీ చెప్పుకోను కానీ ఇక్కడ థర్టీ యియర్స్ ఇండస్ట్రీ :):)]

నేస్తం said...

బాగున్నయ్ అమెరికా సంగతులు :)

Ruth said...

@ భాస్కర్ గారు, హ హ ఊరికే అన్నానండి మరీ అలా పుసుక్కున ఫీలైపొతే ఎలా? :) :)
@ నేస్తం గారు చాలా ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి said...

మేమైతే నైకాన్ కొన్న సంతోషంలో ఒక్లహామా నుంచి కొలరాడో వెకేషన్ మీద వెళ్తూ దార్లో కనపడ్డ ఉల్లిపాయల లారీలని, కార్లను ట్రాన్స్ పోర్ట్ చేసే 18 wheels ట్రక్కుల్ని కూడా ఫొటోలు తీశాం. ఇప్పుడు వాటిని చూస్తే సిగ్గు, నవ్వు రెండూ!

బావున్నాయి మీ అనుభవాలు!

మురళి said...

మీ అనుభవాలు, వాటిని మీరు రాసిన విధానం రెండూ బాగున్నాయండి.. ముఖ్యంగా 'ఇండియన్ క్రో' ..చాలా సేపు నవ్వుకున్నాను... చివర్లో 'అప్పారావ్' కూడా....

Ruth said...

@ సుజాత గారు, :) అవును, నాకు ఇప్పటికీ నా పాత సోనీ DSC అంటే చాలా ఇష్టం. తర్వాత కొన్న కేనన్ డాడీ కి గిఫ్ట్ ఇచ్చేసి నేను ఇంకా నా పాత కేం వాడుతున్నాను.
@ మురళి గారు, థాంక్స్. ఎంత ఇండియన్ క్రో అయినా అమెరికా వాళ్ళకి ఫారిందే కదా, ఎటొచ్చి ఇక్కడినుంచి అక్కడికి వెళ్ళిన నాలాంటివాళ్ళకే :)

హరే కృష్ణ said...

Seatle aa Tom hanks ni gurthuku teppinchesaru Chaos movie kooda..okka photo ayinaa embed cheyyalsindi post lo..vere posT lo pedatharaa

మంచు said...

Sleepless in Seattle ?? chick movie :-)

cbrao said...

చిత్రాలు చూడండి బాబోయ్ అని ఊదరగొట్టి టపాలో ఒక్క చిత్రం అన్నా ఉంచలేదేమిటి? మీ చిత్రాలలో ముఖ్యమైన వాటిని ఏ పికాసోనో లేక ఫొటో బకెట్లోనో పెట్టేసి మీ మిత్రులకి లింక్ పంపిస్తే చూడక చస్తారా, మరీనూ!!

Ruth said...

@ cbrao గారు, థాంక్స్ !
కాని పాయింట్ అదేకదండి, నేను హర్టెడ్, అలిగాను నా పుటోలు ఎవ్వరికీ చూపించను ఇంక! :) :)