Monday, May 3, 2010

వేశ్యా వృత్తి కి చట్టబద్ధత ??? ఒక బంపర్ సొల్యుషన్...

ఈ మధ్య, బ్లాగుల్లో ఉన్న ఒక హాట్ టాపిక్... నళిని జమీల్య గారి పుస్తకం మరియు, దాని మీద రక రకాల రియాక్షన్లు. నేను ఆ పుస్తకం చదివాను కాని దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. పుస్తకం ఏ విధంగాను, విషయ/శైలి, నన్ను కదిలించలేదు. కాని, సౌమ్మ్య గారు లేవదీసిన చర్చ మాత్రం చాలా ఆసక్తిగా ఫాలో అయ్యాను. చాలా మంది మేధావులు, పెద్దవాళ్ళు, ఎన్నో విషయాలు తెలిసినవాళ్ళు చాలా బాగా చర్చించారు....సరె, ఒక రెండు రోజుల క్రితం ఒక న్యూస్ అర్టికల్ చదివాను - హైదరా బాదులో ఒక కూలిపని చేసుకునే భార్య, భర్త ఒక సెక్షువర్కర్తో ఉండగా చూసి తనని కొట్టింది. అతను చచ్చిపోయాడు.
ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అతను చాలా లీగల్ గా, తనలోని వువ్వెత్తున ఎగసే కోరికని (సైన్సు ప్రకారం దీన్ని మనం అర్ధం చేసుకోవాలి అని ఒకరెవరో అన్నరు) అణచుకోలేక, ఒక లీగల్ సెక్ష్ వర్కర్తో, లీగల్ పనిలో ఉన్నాడు. దీన్ని మనం ఏవిధం గాను తప్పుపట్టకూడదని అక్కడ చర్చలో అన్నారు మరి. సరే, ఇప్పుడు అతని లీగల్ భార్యకి అత్యంత సహజం గా కోపం వచ్చింది (భర్త సెక్షువల్ డ్రైవుని అర్ధం చేసుకున్న మనం మరి భార్య కోపాన్ని కూడా అర్ధం చేసుకోవాలి కద).తను ఆవేశంలో భర్తని కొట్టింది (ఇక్కడ మళ్ళి తను భర్తను చంపాలని కొట్టింది అని కూడా అనలేము) కాని, అతను చచ్చిపోయాడు. సరె, ఇప్పుడు ఈ హత్యకి ఎవరికి శిక్ష పడాలి? ఇక్కడ జరిగింది అంతా లీగల్ ఏ కద? నాకు తెలుసు, ఆవిడ భర్తని కొట్ట్డం తప్పు, ఆవిడ చట్టప్రకారం విడాకులు తీసుకోవాలి అంటారు. కాని, ఎంతో విశాల హ్రుదయంతో భర్త గారి వువ్వెత్తున ఎగసిపడే కోరికని అర్ధం చేసుకున్న మనం, మరి తన భర్త తన కళ్ళముందు వేరే ఆమెతో ఉన్నప్పుడు భార్య పడే ఆవేదనని కూడా అర్ధం చేసుకోవాలి కద? మరి, ఎలాగు వ్యభిచారాన్ని కంట్రోల్చెయ్యలేక లీగలైజ్ చేసినట్టు, ఇల్లంటి చావుల్ని కూడా లీగల్ చావుల్ని చేసేద్దామా? అయ్యో, అలా ఎలా కుదురుతుంది? ఈ భార్యకి శిక్ష పడాల్సిందే అంటె మరి వాళ్ళ ముగ్గురు పిల్లలూ రోడ్డున పడవలసిందేనా? అక్కడ సెక్ష్ వర్కర్ ఏమి తప్పు చెయ్యలేదు, తండ్రి ఏమి తప్పుచెయ్యలేదు, తల్లి తనకు తోచింది చేసింది - పిల్లలు ఇప్పుడు అనాధలు. ఇదీ మన లీగల్ సిస్టం మనకి ఇచ్చే సమాధానం !
హ్మ్మ్.... కాబట్టి, వేశ్యా వ్రుత్తిని లీగల్ చెయ్యటం వన వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. మరి నా బంపర్ ఆఫర్ ఏమిటి? అసలు అక్కడ చర్చించిన మేధావులతా సమస్యని ఒకే కోణం లో చూసారు. అందుకే అక్కడ సమస్య తెగలేదు.కత్తి గారు, ఏదొ ప్రివెన్షన్, క్యూర్ ఇంకా ఏవో ఆప్షన్స్ ఇచ్చారు.... కాని, అసలు సమస్య వేశ్యలు కాదండి బాబు ! అసలు వేశ్య అన్న వ్రుత్తి ఎందుకు వచ్చింది? మగ వాడి అవసరం తీర్చడానికే కద ??? ఎలాగు అక్కడ చర్చలో అందరూ బ్లాగుగుద్ది మరీ చెప్పారు, ఆడవాళ్ళకి కోరిక స్థాయిలో మాత్రమే ఉండేది, మగవాడికి అవసరం స్థాయిలో ఉంటుంది అని! సరే, ఒప్పుకున్నాం, మరి మగవాడి వల్ల లేదా మగవాడి అవసరాల వల్ల వచ్చిన సమస్య కి ఆడవాళ్ళ దగ్గర సొల్యుషన్ ఎందుకు వెతుకుతున్నరు? a problem fully defined is, half solved" కాబట్టి, సమా ధానం కూడా మగవాడి దగ్గరనుంచే రావాలి. అంటె మగవాళ్ళు తమ అవసరాలని చట్ట బద్ధమైన విధం గా తీర్చుకోవాలి. ఇది కూడా పెద్ద కష్టం కాదు, పెళ్ళి చెసుకోవచ్చు. అరె, కాని అంత సింపుల్ గా తేలిపోతుందా ఏమిటి? మగవాడి అవసరాలు తీరాలి కాని పెళ్ళి వద్దు! లేదా, పెళ్ళైనా, భార్య ఒక్కతే ఆ అవసరాలు తీర్చలేదు... కాబట్టి అసలు అవసరమే లేకుండాపోతే ???

హా ??? ఏంటీ?? మగవాళ్ళను, మగ మహారాజులను ఎంత మాటా అన్నావు ??? అంటారా? ఎందుకు అనకూడదు? పెళ్ళి చేసుకోకుండా, లేక, పెళ్ళైనా కోరికతో రగిలిపోతూ, రోడ్డున పడి రేపులు/వ్యభిచారం చేసేబదులు, ఇలాంటి వాళ్ళని Castrade చేసేస్తే ఎంటి తప్పు? దీని వల్ల నాకు తెలిసి ఏ రకమైన శారీరక, మానసిక, సామాజిక నష్టమూ లేదు. సరె, ఇప్పుడు ఈ ఆప్షన్ గురించి కొంచెం వివరం గా మాట్లాడుకుందాం...
>> ఇలాచేయడం సహజత్వానికి, మానవ (మగ) స్వభావానికి విరుద్ధం: మరి సెక్ష్ వల్ల వచ్చే సహజ ఫలితం ఐన పిల్లలు పుట్టకుండా నిరోధించడం (కండొంస్, పిల్స్, ఇంకా ఇతర పద్ధతులు) కూడా మానవ స్వభావానికి విరుద్ధమే కదా? ఒక వేళ అన్ని నిరోధకాలు విఫలం అయ్యి కన్సీవ్ ఐతే అబార్షన్ అనే సొల్యుషన్ చెప్తున్నారు, అది నేచర్కి విరుద్ధం కద? కాబట్టి, ఈ పాయింట్ ని కన్సిడర్ చెయ్యక్కరలేదు.
>> ఇలా జరిగిన మగవాడు సమాజంలో ఎన్నొ వివక్ష/అవమానాలు ఎదుర్కుంటాదు: మరి చట్టప్రకరం గా వేశ్య అని ముద్ర పడిన ఆడది కూడా ఇలాంటి వివక్ష/అవమానాలు ఎదుర్కుంటుంది కదా? పైగా, ఇలాంటి లీగల్ వౄత్తి లో వున్నవారి కి పుట్టే పిల్లల సంగతి ఏమిటి అని ఎవరూ కనీసం ఆలోచించనుకూడా లేదు. కాబట్టీ, ఈ పాయింట్ ని కూడా కన్సిడర్ చెయ్యక్కరలేదు.
>> ఈ సొల్యుషన్ వల్ల జీవితం అంతా అతను సెక్ష్ చెయ్యలేడు: కాదు, కొన్ని పద్ధతుల్లో టెంపరరీ గా కూడా చేసే అవకాసం ఉంది. కాబట్టి చదువు, కెరీర్, ఇలాంటి కారణాల వల్ల ఫెళ్ళిని అప్పుడే వద్దనుకునే వాళ్ళూ ఇలా చేస్తే, పెళ్ళి చేసుకునె ముందు, రివర్సల్ చేసుకోవచ్చు.
>> అప్పటికే పెళ్ళైనవాళ్ళు ??? అప్పటికే పెళ్ళైన వాళ్ళకి అప్పటికే భార్య ఉంటుంది కద? ఓహ్ ! సారీ, భార్య తన అవసరాలన్నీ తీర్చలేదు, ఆవిడకి(అంటే ఆడ వాళ్ళకి అంత కోరికలు ఉండవు కదా..) ఇలాంటప్పుడు, భార్య, భర్త కూర్చుని మధ్యే మార్గం గా ఉండె ఒక మాటకి రావాలి అంటే, ఐతే భర్య తన లిబిడొ ని కొంత పెంచుకుని (ఒక్కోసారి ఇన్ష్టం లేకపోయినా) భర్త అవసరాలని తీర్చడం, లెదా, ఆమె కూడా మొత్తం కోరికలు చంపుకుని భర్త ఈ ఆప్షన్ తీసుకోమని అంగీకరించడం.
>> ఇంకా వున్న సవాలక్ష ప్రశ్నలకి, సవాలక్ష సమాధానాలు ఉన్నాయి.... లేదా, అసలు ముందు ఇలాంటి ఆప్షన్ ఒకదాని గురించి ఆలోచించడం అంటూ మొదలుపెడితే, సమాధానాలు దొరుకుతాయి.

హ్మ్మ్.........కాని అసలు ఏ మగాడు, ఇలాంటి విషయాన్ని కలలో కూడా ఒప్పుకోడు. ఎందుకంటే, మగాడు కాబట్టి. ఒక ఆడది తనకు తాను గా తన శరీరాన్ని ఏ విధమైన ప్రేమ/అనుభూతి లేకుండా, కేవలం డబ్బు కోసం అద్దెకిస్తుందని ఒప్పుకుంటాడు, సెక్ష్ వల్ల కలిగే మాత్రుత్వాన్ని ఆవిడ వొదులుకుంటుందని ఒప్పుకుంటాడు, కాని, తన మగతనాన్ని వొదులుకోవడం అనే ఆలోచనకూడా ఒప్పుకోలేడు. ఏం? అంత చిత్తశుద్ధి ఉంటే, సెక్ష్ డైవ్ ని పెంచడానికి వయగ్రాలు కనిపెట్టినట్టు, దాన్ని తగ్గించడానికి మందులు ఎందుకు కనిపెట్టరు? ఏం? దేశం లో దొరికిన ప్రతీ రేపిస్ట్ కీ ఇలాంటి శిక్ష వేస్తే వచ్చే నష్టం ఏమిటి? చీ, అసలు ఇలాంటి విషయం గురించి ఇలా చర్చించే దఔర్భాగ్యం వచ్చినదుకు ఒక ఆడదానిగా సిగ్గు పడుతున్నాను. ఇంకా ఆడా, మగ సమానత్వం గురించి మాట్లాడె అమాయకుల్ని చూసి జాలి పడుతున్నను. బాంకాక్ లో లాగా, మాంసం కోసం కోళ్ళనిపెంచి నట్టు వ్యభిచారం కోసం ఆడపిల్లల్ని పెంచే రోజు మన దేశంలో రాకూడదని ఆశపడుతున్నాను. నా శరీరం, నా ఇష్టం నేను అమ్ముకుంటాను, నా "వృత్తి"ని కూడా గౌరవించడి అని అమాయకత్వం(ignorance) తో అడిగే నళిని జమీల్యలు ఇంక నా దేశంలో ఉండకూడదని కోరుకుంటున్నాను. ఆఖరుగా, మగవాడికి తన మగతనాన్ని వదులుకునే అవకాసం ఇవ్వాలి గాని, ఒక ఆడదాని రక్త మాంసాలతో కూడిన శరీరాన్ని(ఆడదాని ఆత్మను గురించి అందరూ ఎప్పుడొ మర్చిపోయారు కద!), ఆఫ్ట్రాల్ డబ్బు పారేస్తే వచ్చే ఒక కమ్మోడిటీ (వినియోగ వస్తువు) గా చూసే అవకాశం మన భారత చట్టం ఇవ్వకూడదని..... ఒక సామాన్య భారత మహిళగా ప్రార్ధిస్తున్నాను.