Monday, May 3, 2010

వేశ్యా వృత్తి కి చట్టబద్ధత ??? ఒక బంపర్ సొల్యుషన్...

ఈ మధ్య, బ్లాగుల్లో ఉన్న ఒక హాట్ టాపిక్... నళిని జమీల్య గారి పుస్తకం మరియు, దాని మీద రక రకాల రియాక్షన్లు. నేను ఆ పుస్తకం చదివాను కాని దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. పుస్తకం ఏ విధంగాను, విషయ/శైలి, నన్ను కదిలించలేదు. కాని, సౌమ్మ్య గారు లేవదీసిన చర్చ మాత్రం చాలా ఆసక్తిగా ఫాలో అయ్యాను. చాలా మంది మేధావులు, పెద్దవాళ్ళు, ఎన్నో విషయాలు తెలిసినవాళ్ళు చాలా బాగా చర్చించారు....సరె, ఒక రెండు రోజుల క్రితం ఒక న్యూస్ అర్టికల్ చదివాను - హైదరా బాదులో ఒక కూలిపని చేసుకునే భార్య, భర్త ఒక సెక్షువర్కర్తో ఉండగా చూసి తనని కొట్టింది. అతను చచ్చిపోయాడు.
ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అతను చాలా లీగల్ గా, తనలోని వువ్వెత్తున ఎగసే కోరికని (సైన్సు ప్రకారం దీన్ని మనం అర్ధం చేసుకోవాలి అని ఒకరెవరో అన్నరు) అణచుకోలేక, ఒక లీగల్ సెక్ష్ వర్కర్తో, లీగల్ పనిలో ఉన్నాడు. దీన్ని మనం ఏవిధం గాను తప్పుపట్టకూడదని అక్కడ చర్చలో అన్నారు మరి. సరే, ఇప్పుడు అతని లీగల్ భార్యకి అత్యంత సహజం గా కోపం వచ్చింది (భర్త సెక్షువల్ డ్రైవుని అర్ధం చేసుకున్న మనం మరి భార్య కోపాన్ని కూడా అర్ధం చేసుకోవాలి కద).తను ఆవేశంలో భర్తని కొట్టింది (ఇక్కడ మళ్ళి తను భర్తను చంపాలని కొట్టింది అని కూడా అనలేము) కాని, అతను చచ్చిపోయాడు. సరె, ఇప్పుడు ఈ హత్యకి ఎవరికి శిక్ష పడాలి? ఇక్కడ జరిగింది అంతా లీగల్ ఏ కద? నాకు తెలుసు, ఆవిడ భర్తని కొట్ట్డం తప్పు, ఆవిడ చట్టప్రకారం విడాకులు తీసుకోవాలి అంటారు. కాని, ఎంతో విశాల హ్రుదయంతో భర్త గారి వువ్వెత్తున ఎగసిపడే కోరికని అర్ధం చేసుకున్న మనం, మరి తన భర్త తన కళ్ళముందు వేరే ఆమెతో ఉన్నప్పుడు భార్య పడే ఆవేదనని కూడా అర్ధం చేసుకోవాలి కద? మరి, ఎలాగు వ్యభిచారాన్ని కంట్రోల్చెయ్యలేక లీగలైజ్ చేసినట్టు, ఇల్లంటి చావుల్ని కూడా లీగల్ చావుల్ని చేసేద్దామా? అయ్యో, అలా ఎలా కుదురుతుంది? ఈ భార్యకి శిక్ష పడాల్సిందే అంటె మరి వాళ్ళ ముగ్గురు పిల్లలూ రోడ్డున పడవలసిందేనా? అక్కడ సెక్ష్ వర్కర్ ఏమి తప్పు చెయ్యలేదు, తండ్రి ఏమి తప్పుచెయ్యలేదు, తల్లి తనకు తోచింది చేసింది - పిల్లలు ఇప్పుడు అనాధలు. ఇదీ మన లీగల్ సిస్టం మనకి ఇచ్చే సమాధానం !
హ్మ్మ్.... కాబట్టి, వేశ్యా వ్రుత్తిని లీగల్ చెయ్యటం వన వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. మరి నా బంపర్ ఆఫర్ ఏమిటి? అసలు అక్కడ చర్చించిన మేధావులతా సమస్యని ఒకే కోణం లో చూసారు. అందుకే అక్కడ సమస్య తెగలేదు.కత్తి గారు, ఏదొ ప్రివెన్షన్, క్యూర్ ఇంకా ఏవో ఆప్షన్స్ ఇచ్చారు.... కాని, అసలు సమస్య వేశ్యలు కాదండి బాబు ! అసలు వేశ్య అన్న వ్రుత్తి ఎందుకు వచ్చింది? మగ వాడి అవసరం తీర్చడానికే కద ??? ఎలాగు అక్కడ చర్చలో అందరూ బ్లాగుగుద్ది మరీ చెప్పారు, ఆడవాళ్ళకి కోరిక స్థాయిలో మాత్రమే ఉండేది, మగవాడికి అవసరం స్థాయిలో ఉంటుంది అని! సరే, ఒప్పుకున్నాం, మరి మగవాడి వల్ల లేదా మగవాడి అవసరాల వల్ల వచ్చిన సమస్య కి ఆడవాళ్ళ దగ్గర సొల్యుషన్ ఎందుకు వెతుకుతున్నరు? a problem fully defined is, half solved" కాబట్టి, సమా ధానం కూడా మగవాడి దగ్గరనుంచే రావాలి. అంటె మగవాళ్ళు తమ అవసరాలని చట్ట బద్ధమైన విధం గా తీర్చుకోవాలి. ఇది కూడా పెద్ద కష్టం కాదు, పెళ్ళి చెసుకోవచ్చు. అరె, కాని అంత సింపుల్ గా తేలిపోతుందా ఏమిటి? మగవాడి అవసరాలు తీరాలి కాని పెళ్ళి వద్దు! లేదా, పెళ్ళైనా, భార్య ఒక్కతే ఆ అవసరాలు తీర్చలేదు... కాబట్టి అసలు అవసరమే లేకుండాపోతే ???

హా ??? ఏంటీ?? మగవాళ్ళను, మగ మహారాజులను ఎంత మాటా అన్నావు ??? అంటారా? ఎందుకు అనకూడదు? పెళ్ళి చేసుకోకుండా, లేక, పెళ్ళైనా కోరికతో రగిలిపోతూ, రోడ్డున పడి రేపులు/వ్యభిచారం చేసేబదులు, ఇలాంటి వాళ్ళని Castrade చేసేస్తే ఎంటి తప్పు? దీని వల్ల నాకు తెలిసి ఏ రకమైన శారీరక, మానసిక, సామాజిక నష్టమూ లేదు. సరె, ఇప్పుడు ఈ ఆప్షన్ గురించి కొంచెం వివరం గా మాట్లాడుకుందాం...
>> ఇలాచేయడం సహజత్వానికి, మానవ (మగ) స్వభావానికి విరుద్ధం: మరి సెక్ష్ వల్ల వచ్చే సహజ ఫలితం ఐన పిల్లలు పుట్టకుండా నిరోధించడం (కండొంస్, పిల్స్, ఇంకా ఇతర పద్ధతులు) కూడా మానవ స్వభావానికి విరుద్ధమే కదా? ఒక వేళ అన్ని నిరోధకాలు విఫలం అయ్యి కన్సీవ్ ఐతే అబార్షన్ అనే సొల్యుషన్ చెప్తున్నారు, అది నేచర్కి విరుద్ధం కద? కాబట్టి, ఈ పాయింట్ ని కన్సిడర్ చెయ్యక్కరలేదు.
>> ఇలా జరిగిన మగవాడు సమాజంలో ఎన్నొ వివక్ష/అవమానాలు ఎదుర్కుంటాదు: మరి చట్టప్రకరం గా వేశ్య అని ముద్ర పడిన ఆడది కూడా ఇలాంటి వివక్ష/అవమానాలు ఎదుర్కుంటుంది కదా? పైగా, ఇలాంటి లీగల్ వౄత్తి లో వున్నవారి కి పుట్టే పిల్లల సంగతి ఏమిటి అని ఎవరూ కనీసం ఆలోచించనుకూడా లేదు. కాబట్టీ, ఈ పాయింట్ ని కూడా కన్సిడర్ చెయ్యక్కరలేదు.
>> ఈ సొల్యుషన్ వల్ల జీవితం అంతా అతను సెక్ష్ చెయ్యలేడు: కాదు, కొన్ని పద్ధతుల్లో టెంపరరీ గా కూడా చేసే అవకాసం ఉంది. కాబట్టి చదువు, కెరీర్, ఇలాంటి కారణాల వల్ల ఫెళ్ళిని అప్పుడే వద్దనుకునే వాళ్ళూ ఇలా చేస్తే, పెళ్ళి చేసుకునె ముందు, రివర్సల్ చేసుకోవచ్చు.
>> అప్పటికే పెళ్ళైనవాళ్ళు ??? అప్పటికే పెళ్ళైన వాళ్ళకి అప్పటికే భార్య ఉంటుంది కద? ఓహ్ ! సారీ, భార్య తన అవసరాలన్నీ తీర్చలేదు, ఆవిడకి(అంటే ఆడ వాళ్ళకి అంత కోరికలు ఉండవు కదా..) ఇలాంటప్పుడు, భార్య, భర్త కూర్చుని మధ్యే మార్గం గా ఉండె ఒక మాటకి రావాలి అంటే, ఐతే భర్య తన లిబిడొ ని కొంత పెంచుకుని (ఒక్కోసారి ఇన్ష్టం లేకపోయినా) భర్త అవసరాలని తీర్చడం, లెదా, ఆమె కూడా మొత్తం కోరికలు చంపుకుని భర్త ఈ ఆప్షన్ తీసుకోమని అంగీకరించడం.
>> ఇంకా వున్న సవాలక్ష ప్రశ్నలకి, సవాలక్ష సమాధానాలు ఉన్నాయి.... లేదా, అసలు ముందు ఇలాంటి ఆప్షన్ ఒకదాని గురించి ఆలోచించడం అంటూ మొదలుపెడితే, సమాధానాలు దొరుకుతాయి.

హ్మ్మ్.........కాని అసలు ఏ మగాడు, ఇలాంటి విషయాన్ని కలలో కూడా ఒప్పుకోడు. ఎందుకంటే, మగాడు కాబట్టి. ఒక ఆడది తనకు తాను గా తన శరీరాన్ని ఏ విధమైన ప్రేమ/అనుభూతి లేకుండా, కేవలం డబ్బు కోసం అద్దెకిస్తుందని ఒప్పుకుంటాడు, సెక్ష్ వల్ల కలిగే మాత్రుత్వాన్ని ఆవిడ వొదులుకుంటుందని ఒప్పుకుంటాడు, కాని, తన మగతనాన్ని వొదులుకోవడం అనే ఆలోచనకూడా ఒప్పుకోలేడు. ఏం? అంత చిత్తశుద్ధి ఉంటే, సెక్ష్ డైవ్ ని పెంచడానికి వయగ్రాలు కనిపెట్టినట్టు, దాన్ని తగ్గించడానికి మందులు ఎందుకు కనిపెట్టరు? ఏం? దేశం లో దొరికిన ప్రతీ రేపిస్ట్ కీ ఇలాంటి శిక్ష వేస్తే వచ్చే నష్టం ఏమిటి? చీ, అసలు ఇలాంటి విషయం గురించి ఇలా చర్చించే దఔర్భాగ్యం వచ్చినదుకు ఒక ఆడదానిగా సిగ్గు పడుతున్నాను. ఇంకా ఆడా, మగ సమానత్వం గురించి మాట్లాడె అమాయకుల్ని చూసి జాలి పడుతున్నను. బాంకాక్ లో లాగా, మాంసం కోసం కోళ్ళనిపెంచి నట్టు వ్యభిచారం కోసం ఆడపిల్లల్ని పెంచే రోజు మన దేశంలో రాకూడదని ఆశపడుతున్నాను. నా శరీరం, నా ఇష్టం నేను అమ్ముకుంటాను, నా "వృత్తి"ని కూడా గౌరవించడి అని అమాయకత్వం(ignorance) తో అడిగే నళిని జమీల్యలు ఇంక నా దేశంలో ఉండకూడదని కోరుకుంటున్నాను. ఆఖరుగా, మగవాడికి తన మగతనాన్ని వదులుకునే అవకాసం ఇవ్వాలి గాని, ఒక ఆడదాని రక్త మాంసాలతో కూడిన శరీరాన్ని(ఆడదాని ఆత్మను గురించి అందరూ ఎప్పుడొ మర్చిపోయారు కద!), ఆఫ్ట్రాల్ డబ్బు పారేస్తే వచ్చే ఒక కమ్మోడిటీ (వినియోగ వస్తువు) గా చూసే అవకాశం మన భారత చట్టం ఇవ్వకూడదని..... ఒక సామాన్య భారత మహిళగా ప్రార్ధిస్తున్నాను.

27 comments:

తెలుగు వెబ్ మీడియా said...

వ్యభిచారం చేసేవాడి చేతులు నరికేస్తే వాడు ఏ ఆడదాని ఒంటి మీద చేతులు వెయ్యలేడు. మగమహారాజులకి ఇదే సమాధానం.

శరత్ కాలమ్ said...

"సెక్ష్ డైవ్ ని పెంచడానికి వయగ్రాలు కనిపెట్టినట్టు, దాన్ని తగ్గించడానికి మందులు ఎందుకు కనిపెట్టరు? ఏం? దేశం లో దొరికిన ప్రతీ రేపిస్ట్ కీ ఇలాంటి శిక్ష వేస్తే వచ్చే నష్టం ఏమిటి?"

అటువంటి మందులు వున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో రిపీటేడ్ రేపిస్టులకి కొంతమందికి అవి ఇస్తున్నారు.

ఇక మీరు చెప్పిన పరిష్కారం కంటే మంచి పరిష్కారం ఇంకొకకటి వుంది. మగవాళ్ళ నందరినీ ఉరి తీయడం - పీడ వదిలిపోతుంది.

తెలుగు వెబ్ మీడియా said...

నరాల వీక్నెస్ వల్ల ఉద్రేకానికి పోయి రేపులు చేసేవాళ్ళకి మాత్రమే మందులు వేస్తారు. ఏ వీక్నెస్ లేకుండా అత్యాచారం చేసేవాళ్ళ చేతులు నరికెయ్యాలి.

Software Tykoon said...

చె.శ గారు ఎవరు నరకాలి అంటారు ? ప్రభుత్వమా ?
మరి దొంగ తనం చేస్తే కుడా చేతులు నరకాల?
రెండు రకాల నేరాలకు ఒకే శిక్ష ?

Ruth said...

@ చెరశాల గారు, మగవాడి చేతులు నరికేస్తె, అతను ఏ పనులూ చేసుకోలేడు కదా....
@ శరత్ గారు, exactly !!! మీరు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు 100% రియాక్ట్ అయ్యారు. అంటే ఒక మగాడు తన మగతనం వదులుకోవడం కన్నా చచ్చిపోవడం మేలు. శభాష్! మరి ఒక ఆడది, తన శరీరాన్ని అవసరంకోసం అమ్ముకోవచ్చు, ఇది చావుకన్నా ఎన్నిరెట్లు భయంకరమో మీకు తెలుసా? ఏ ఆడపిల్లా ఒక టీచర్, ఒక డాక్టర్, ఒక ఇంజినీర్ లాగా ఒక వేశ్య అవ్వాలని కలలు కనదు, వాళ్ళూ ఏదో తప్పించుకోలేని పరిస్థితుల వల్ల అలా అయి ఉంటారు. మరి వాళ్ళందరూ ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవట్లేదు అంటే నేను సమాధానం చెప్పలేను. కాని, వీలైనంత మట్టుకి అలాంటి వాళ్ళని కౌన్సిల్ చేసి వేరే ఉపాధి చూపించాలి కాని, వేశ్య వృత్తి అని దాన్ని లీగలైజ్ చేస్తే, ఇండియా లాంటి దేశం లో ఎంత ప్రమాదం? సొంత పిల్లల్ని ఆరేడేళ్ళ వయసులో పనులకి పంపించే తల్లిదండ్రులు/పరిస్థితులు ఉన్న దేశం లో ఆడ పిల్ల పుట్టగానే ఒక ప్రొఫెషన్ కి క్వాలిఫైడ్ (ఈ వృత్తి ఆడపిల్ల ఐతే చాలు కద) అనే భావన ఎంత ప్రమాదకరమో ఆలోచించారా?

Malakpet Rowdy said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...

అమ్మలారా, అయ్యలారా! ఆపండేహే!! నెల రోజులనుండీ ప్రతీ బ్లాగులో ఇదే గొల. వ్యభిచారమనేది వరకట్నం లాంటిది. చట్టబధ్ధం చేసినా చెయ్యకపోయినా కొనసాగుతూనే ఉంటుంది. కానీ, చట్టబధ్ధం చేస్తే ఒక బాధ - చెయ్యకపోతే ఒక బాధ:

చట్టబధ్ధం చెయ్యకపోతే మరికొంతమంది భారతీయులు ఎయిడ్స్ బారినపడే ప్రమాదం ఉంది. పాపం ఆ ఆడపిల్లలు తమ సంపాదనలో కొంత పోలీసులకి చదివించుకుంటూనే ఉండాలి.

చట్టబధ్ధం చేస్తే టేక్స్ కట్టాలి :)) దాన్ని చట్టబధ్ధం చేసినంత మాత్రాన వాళ్ళకి గౌరవం వచ్చేస్తుందనుకుంటే, ( పైగా అదీ వృత్తిని బట్టీ గౌరవం దక్కే "Dignity of labor " లేని భారతదేశంలో ) అది నళినీ జమీల్యా పొరపాటే.

Praveen Mandangi said...

రూత్ గారు. వాడి కుడి చెయ్యి నరికేస్తే అశుద్ధం కడుక్కునే చేతితోనే అన్నం తినే పరిస్థితి వస్తుంది. ఆ జుగుప్సకరమైన శిక్ష విధించినా మంచిదే కదా.

Software Tykoon said...

ప్రవీణ్ గారు మరి చెయ్యి నరికితే రేప్ చెయ్యలేరా ?

కుడి చెయ్యి, ఎడమ చెయ్యి నరికేస్తే రేప్ చెయ్యలేరా ?

తార said...
This comment has been removed by a blog administrator.
తార said...
This comment has been removed by a blog administrator.
Ruth said...

@ తారా న్ బుచోడు మీరు ప్రవీణ్ తో ఏమైనా చెప్పాలనుకుంటే, అతని బ్లాగులో చెప్పితే మంచిది. (మీ కామెంట్స్ తొలగిస్తున్నాను)

@ మలక్ గారు, అవును నాకూ విసుగు వచ్చింది, సో కాల్డ్ మేధావుల వివరణలు చూసి. అందుకే ఇలా రాయవలసి వచ్చింది. ఐనా మీరు చెప్పినట్టు, వరకట్నం, వ్యభిచారం ఒక్కటే కాదు. అసలు వ్యభిచారం/రేప్ కేసుల్లో పట్టుబడ్డవారందరికీ ఇలాంటి శిక్ష ఉంటే, ఆటోమేటిక్ గా అవితగ్గుతాయి. ఐనా మన ప్రభుత్వాలకి అంత చిత్తశుద్ధి ఎక్కడ ఏడ్చింది లెండి?

తెలుగు వెబ్ మీడియా said...

నా బ్లాగ్ లో కామెంట్ మోడరేషన్ ఉంది. అందుకే వాళ్ళు నా బ్లాగ్ లో కామెంట్లు పోస్ట్ చెయ్యరు. డ్రగ్స్ ట్రాఫికింగ్ కూడా నిషేధం నడుమ దొంగచాటుగా జరుగుతోంది. అలాగని డ్రగ్స్ వ్యాపారానికి లైసెన్సులు ఇవ్వగలమా? మరి వ్యభిచారానికి మాత్రమే లైసెన్సులు ఇవ్వాలని ఎందుకంటున్నారు? డ్రగ్స్ వ్యాపారానికి లైసెన్సులు ఇస్తే ఈ మేధావుల పిల్లలు కూడా అడిక్ట్ అయ్యి చిన్న వయసులో జీవితాలు నాశనం చేసుకుంటారు.

తార said...

telugu bloggers ni oka guerrilla nunchi kapadatame memu chesedi, meeku inka aa effect tagalaledu, ante

Anonymous said...

@ Ruth
సాధారణమైన భారతీయ స్త్రీగా మీరు మరో విషయాన్ని మరిచిపోయినట్టున్నారు. ఆడది మగాడు ఇద్దరికీ ఇష్టమయి సెక్స్ చేస్తే అది తప్పు కాదు. కాబట్టి, పార్కుల్లో కక్కుర్తి పడే ప్రేమికులు (?), కేవలం దానికోసమే పరిచయాలు పెంచుకునే వారూ చాలా వున్నారు. కండోముల బిజినెస్సు ఇంతగా వుండడానికి కారణం కేవలం వ్యభిచారమే అనుకుంటే పొరపటే కదా. మరి ఈ ఆధునిక మహిళలకి కూడా మగాల్లకు మీరు సజెస్ట్ చేసిన దాన్నే సజెస్టు చేస్తూ టపీమని ఒక టపా రాయొచ్చుగా!!అంచేత ఆడవారికి కూడా ఈ మందులు తీసుకోనే సౌకర్యము ఉండాలని, పెళ్ళికి ముందు శృంగారం ఆడ చేసినా మగ చేసినా ఈ మందులివ్వాలని నేను ఈ సందర్భంగా డిమాండు చేస్తున్నాను.

సవ్వడి said...

రుత్ గారు! మొదటగా మరియు ఆలస్యంగా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
ఈ పుస్తకాలన్నీ ఎప్పుడు చదివేస్తారండి బాబు. నేను ఎంత చదువుదామనుకున్నా నాకు కుదరట్లేదు. సుజాత గారి బ్లాగు నుంచి మీ బ్లాగుకి వచ్చాను. చాలా విషయాలు తెలిసాయి. దానికన్నా ముందు మీ ప్రేమ కథ ఆసక్తిని కలిగించింది. చెప్పండి మీ కథ.
ఇకపోతే మీ పరిష్కారం గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేనైతే అక్కడ సౌమ్య గారు చెప్పిన విషయంతో ఏకీభవించాను. లీగలైజ్ చెయ్యడాన్ని పూర్తిగా వ్యతిరేఖిస్తున్నాను.

Ruth said...

@ ఆకాశ రామన్న గారు, ఇక్కడ సమస్య పెళ్ళికి ముందు శృంగారం గురించి కాదండీ (దాని గురించి కూడా మేధావులు, మహానుభావులు ఇంకా సుప్రీం కోర్టు... చెప్పాయి కదా) వ్యభిచారాన్ని అరికట్టడానికి/కంట్రోల్ చెయ్యడానికి, చట్టబద్ధం చెయ్యటమే పరిష్కారం అంటుంటేను, అహా! అలా కాదు, ఇంకా వేరే ఉపాయాలు కూడా ఉన్నాయని....
పైగా, ఈ టపా కి నేను ముందే చెప్పినట్టు సౌమ్య గారి బ్లాగులో వచ్చిన టపా ఇన్స్ప్రిరేషన్. అది చదివిన తరువాత ఇది చదివితే నా పాయింటు ఇంకా బాగా అర్ధం అవుతుంది.

@ సవ్వడి గారు, :) చాలా థాంక్స్.
నేను నా రెండొ క్లాసునుండి చదవటం మొదలుపెట్టానండీ, కాని మన బ్ల్లాగ్లోకంలో ఉన్నవాళ్ళతో పోలిస్తే, అంత పెద్ద చదువరినేమీ కాదు. ఇంక, నా ప్రేమ కథ :) మీరు చదివినదే అంతకన్నా పెద్దగా ఏంలేదు... మేము ఆర్కుట్లో కలిసాము, ఒక ఏడాది తరువాత పెళ్ళి చేసుకున్నాము అంతే. నాకు తెలిసి మా అసలు ప్రేమ కథ మా పెళ్ళయ్యాకే స్టార్ట్ అయ్యింది.
ఇంక, ఈ పొస్ట్ గురించి, నా అభిప్రాయం ఆఖరు పేరాలో రాసాను. మిగతా అంతా ఏదో ఆవేశం తీర్చుకోడానికి.......

మూడో పురుషార్థమ్ said...

Nice post.. baagaa cheppaaru.. idi chadivaaka nenu idi raasina mimmalni abhinandincha lekundaa undaleka poyaanu.

Unknown said...

Ruth గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

Vinay Chakravarthi.Gogineni said...

edo telusanukune emee teliyani me blagu choosinanduku nenu siggupadutunnanu.

charge4u said...

sex ki chatta baddat unte desam lo eeneralu anni taggu tayiee repulu murderlu kuda taggu tayi prati vokkalu netlu chepadam kadu ammaye oppukunte evadina denga kunda untada cheppandi

charge4u said...

itla netulu cheppe valla andarlu edo aka ammeyeto affair kacchitamuga untadi plz no neetulu andru kamdule evariki legava kunda untadi
evaru denda kunda untaru

Unknown said...

neetulu andaru cheabutaru kaani evadu acharinxharu..parulaku cheappadaniki maatramea avi paniki vastai...pyna neetulu cheapina vallalo enta mandi tana pellani tappa megilina vallani tobutuvula chusukuntunnaru...road meeda aadadi kanapaditea pedda chnna ,vaavi varusa leakunda sollu kabrlu butujokes veastru,kamadrustito chustaru ee nakoduku niiti gunchi cheabutunnaru...cheapavi sriranga nitulu cheasavi Gudisati veasalu...mundu meeru maari taru vata mee peelaleku aa taruvata samajani ki neetulu cheapandra ...neenu avadyna lanjala dagari vellamani balavanta pettaleadu kada evadi dula vadidhi..sexworkers ga maararu antea vaalu anni kastalo untea tappa valu aa pani cheastaroa ani alochinchaka vaala meeda comments cheastara ...meeku anta senu untea valla gurinchi amyna manchi pani cheasi appudu comments cheayandra bodcowlra........

Unknown said...

"manam maaradham samajani marchudam"vallalonu manchivallu unnaru time bagoka kutumbha paristitulu baagoka aadukunea nadudu leaka vaalu pottakuti kosam aa pani cheastunnaru...vaalu mana lanti manusulea vaalanu manalaga gowraviddam............i love my motherland and my neighbours......9533446112

Praveen Mandangi said...

వైజాగ్‌లో వ్యభిచారం చేసే దుర్గ అనే మహిళ దగ్గరకి ఇద్దరు విటులు వెళ్ళారు. ఆమె ఒంట్లో బాలేక వాళ్ళతో పడుకోవడానికి ఒప్పుకోలేదని వాళ్ళు ఆమెని చితకకొట్టారు. ఆమె వాళ్ళ మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది. సంసారం చేసే స్త్రీ ఒక మగవాని చేత తన్నులు తింటే వ్యభిచారం చేసే స్త్రీ పది మంది మగవాళ్ళ చేత తన్నులు తింటుంది. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే స్త్రీలకి పెరిగే గౌరవం ఏమీ ఉండదు.

Praveen Mandangi said...

నళిని జమీలా వ్రాసిన పుస్తకాన్ని కొందరు మహిళా బ్లాగర్లే పొగిడి దాని సేల్స్ పెంచారు. వ్యభిచారం కంటే జుగుప్సకరమైన పాకీ వృత్తి ఉండగా వ్యభిచారాన్నే ఎందుకు నిషేధించాలి అంటూ జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. పాకీ వృత్తి జుగుప్సకరమైనదే. కాదనలేదు. కానీ వ్యభిచారం దాని కంటే తక్కువ జుగుప్స కలిగించేది అని చెప్పి వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యాలా?

Praveen Mandangi said...

బ్లాగుల్లోకి ఈ చర్చ వచ్చందే నళినీ జమీలా జీవిత చరిత్రని పొగుడుతూ కొందరు వ్రాయడం వల్ల. ఇప్పుడు కూడా ఆమె పుస్తకం అంగట్లో అమ్ముడుపోతూనే ఉంది. వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చేసే మేతావులని సంఘ సంస్కర్తలుగా నమ్మేవాళ్ళు ఉన్నంత కాలం అవి అమ్ముడుపోతూనే ఉంటాయి.