Monday, January 11, 2010

అమెరికా అబ్బాయిలు !

టట్టడ... టట్టడ... టట్టడ...టడట్టడట్టంటట్టండం...టడట్టడట్టంటట్టండం.....
నేను: హల్లో
అట్నుంచి : ఒస్సే నిద్ర మొహమా, ఎంతసేపు పడుకుంటావ్, లెగు!
అలవాటైన తిట్లు వినిపించి కాల్ చెసింది తబి(మా కసిన్) అని గుర్తించాను.
నేను: అబ్బా, మంచి నిద్రలో లేపేసావే, మ్మ్ చెప్పు ఏంటి విశేషాలు?
తబి: ఏమే, మామయ్య(అంటె మా డాడీ) నీకు పెళ్ళి చెయ్యాలని ఎంతో ఆశపడుతున్నరు కద,
నేను: ఊ
తబి: కాని నువ్వు ఎవరికీ నచ్చట్లేదు కదా...
నేను: ఆగు, నేను ఎవ్వరికీ నచ్చడం కాదు, నాకే ఎవ్వరూ నచ్చట్లేదు.
తబి: సరెలె, ఏదో ఒకటి, మొత్తానికి నువ్వు ఎవ్వరినీ ok చెయ్య్ట్లెదు కాబట్టి, మన వైజాగ్ గేంగ్ తరుపున నీకు ఒక అద్భుతమైన అవుడియా...
నెను: నువ్వు సుత్తి ఆపి విషయం చెప్పు
తబి: అదె, నువ్వేమో గడ కర్రంత ఉన్నావు, అనకాపల్లి ఐనా అమెరికా లెవెల్ మైంటైన్ చేస్తావు, నీకు ఈ ఇండియా వాళ్ళు ఎలాగు నచ్చరు, నువ్వు ఎలాగు అమెరికా వెళ్తున్నవు కాబట్టి, అక్కడే ఎవడొ ఒక మంచి అమెరికా అబ్బాయిని చూసి లైన్లొ పెట్టెయ్ (నీకు మా అందరి సప్పొర్ట్ వుంటుంది) నువ్వు అమెరికా వాడ్ని పెళ్ళి చెసుకుంటే మేము కూడా అప్పుడప్పుడూ అమెరికా రావచ్చు... ఏమంటావ్?
నేను: .....
తబి: ఒస్సే, ఉన్నావా?
నేను: ఆ.... ఉన్నాను...
తబి: హ్మ్... ఉన్నాను, విన్నాను కాదు, నేను చెప్పిన విషయం బాగా ఆలొచించు.ఆల్ ద బెస్ట్ !
********************************************************************
నేను ఫ్లైట్ ఎక్కే రోజు రానే వచ్చింది. మొదటి సారి కాబట్టీ, మలేసియా వెళ్ళేవరకు, ఫ్లైట్ అట్టెండెంట్స్ ని చూడటం, వాళ్ళు పెట్టింది తినాలా వద్దా అని సంశయించటం, హెడ్ఫోన్స్ తగిలించుకుని పాటలు వినటం, వీటితో సరిపోయింది. కాని, మలేసియాలో ఎక్కిన ఫ్లయిట్ 18 అవర్స్... ఇంక మా తబి చెప్పిన విషయం గురించి ఆలోచించడానికి టైం దొరికింది. ఆలోచించగా చించగా.... నాకు కూడా ఇదేదో బాగానే ఉన్నట్టుంది, ఐనా ఒక రాయేస్తె పొయేదేముంది అని డిసైడ్ అయ్యాను. ఇంక చూస్కో, ఆహా, ఆ వచ్చేవాడు (నచ్చేవాడు) ఎలా ఉండాలా అని తెగ ఆలోచనలు. టాం క్రూస్, బ్రాడ్ పిట్ మరీ క్యూట్ టైపు, పోని మెల్గిబ్సన్, రిచర్డ్ గేర్ మరీ ముసలి ముఖాలు పోని బెన్ ఏఫ్లెక్? అబ్బా, బాగుంటాడు కదా... ఐనా మరీ అంత స్పెసిఫిక్ గా వద్దులే, కొంచెం కొంచెం దగ్గరలో ఉన్నా పర్వాలేదు..... ఇలా ఆలోచిస్తూ పడుకున్నా....
******************************************************************************
సరె, అమెరికా వచ్చేసాం, మనకి అమెరికా వాళ్ళతో ఇంటెరాక్షన్ అయ్యేది ఆఫీస్ కాబట్టి ముందు నా వేట(ఇంతకన్న కర్రెక్ట్ పదం దొరకట్లేదు మరి) అక్కడె మొదలుపెట్టలి అనుకున్నా. ముందు గా, నా టీం - ఇద్దరు ఇండియా వాళ్ళు (అందులో ఒకడు మా బాసు), ఒక చైనా వాడు, ఒక పాకిస్తాని వాడు (గ్ర్ర్...), ఇంక ఫైనల్గా ఇద్దంటే ఇంద్దరే ఇద్దరు అమెరికా వాళ్ళు: వాళ్ళల్లో ఒకడు అంకులు(ఒక పెళ్ళి+ ఒక డైవర్స్+ ఒక పిల్ల+ లుక్స్లో దగ్గర దగ్గర మన బ్రహ్మ్మనందం లాగ అనుకోవచ్చు), ఇంక మిగిలింది ఒక అమెరికా పిల్లోడు: వీడు పాపం చాలా మంచి వాడు, హైటు వైటు బాగానే ఉన్నాడు, మాంచి రంగు. ఎంత రంగంటె, మనిషి తెలుపు, జుట్టూ తెలుపు,కళ్ళు తెలుపు, కనుబొమ్మలు తెలుపు, కనురెప్పలు కూడా తెలుపే. పాపం అనకూడదు గాని, మొదట చూసినప్పుడు దడుసుకున్నాను. పైగా వాడు నాకు కౌంటర్పార్ట్, చాలా చిన్న పిల్లోడు. అప్పుడె కాలేజి పూర్తి చేసుకుని వచ్చాడంట. సరె, ఇక చేసేదేముంది, ఐనా అస్సలు మన పెర్సనల్ లైఫు, ప్రొఫెషనల్ లైఫు కలప కూడదు కద, వెరే దారి వెతుకుదాంలే అని సరిపెట్టేసాను.
**********************************************************************************
అమెరికా లో మొదటి ఆదివారం- అప్పుడే లేగిసిన హిమ నన్ను చూసి కెవ్వుమని ఒక కేక పెట్టింది. అవును మరి, రోజు అదరూ లేచి రెడీ అయ్యి వెళ్తూ వెళ్తూ ఒక తాపు తంతే, అవి కూడా లెక్కబెట్టుకుని, అందరూ తన్నేక మాత్రమే లెగిసే నేను, ఆ రోజు తొమ్మిదిన్నర కల్లా లేచి, స్నానం చేసి, రెడీ అయ్యి వుండటం చూసి దడుసుకుని వుంటుంది. దెబ్బకి బద్ధకం గా దొర్లుతున్న మా వాళ్ళంతా లేచి వచ్చారు. ఏంటి సంగతి? ఈ వాళ ఆది వారం కదా. ఐతే? చర్చ్ కి వెళ్ళాలి కద. ఏంటీ నువ్వు ఇప్పుడు చర్చ్ కి వెళ్తావా? అవును కదా మరి! ( అప్పుడే మా వాళ్ళందరి ముఖాల్లోనూ ఒక పేద్ద అవుడియా కళ కళ లాడి పోతూంది) హే నువ్వు చర్చ్ కి వెళ్ళి, అక్కడ ఒక మంచి అమెరికా అబ్బయిని పడెయ్యాలి! అందరూ కలసికట్టుగా తీర్మానించేసారు. హ్మ్మ్...ఒరి, అమాయకులారా, ఈ విషయం నాకు ఇండియా లో ఉన్నప్పుడే తెలుసు అని మనసులోనే అనుకున్నా. జిగ్ జిగేలుమని(చార్మినార్ దగ్గర కొన్న) సల్వార్ వేసుకుని, చర్చ్ కి బయలుదేరాను.......ఇంటికి వచ్చేసరికి అందరూ ఆవేశం గా ప్రశ్నలెయ్యటం మొదలు పెట్టరు: హెయ్, ఎంతమంది అబ్బాయిలు పరిచయం అయ్యారు? ఎలా ఉన్నారు? బాగా మాట్లాడారా? మాకు కూడా పరిచయం చెయ్యాలి అంటూ... సారీ, నేను అస్సలు చర్చ్ కి చర్చ్ కోసమే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. ఇంకెప్పుడూ ఈ అవుడియాని చర్చ్లో మాత్రం ఫాలో అవ్వను- సీరియస్ గానే చెప్పేసాను. ఫ్లాష్ బాక్లో జరిగింది ఇది: రోజు ఆఫీస్ కి వెళ్ళె దారిలో ఉండే చర్చ్, మాకు చాలా దగ్గర. చాలా గంభీరం గా, చుట్టూ పక్కల పెద్ద పెద్ద చెట్లతో చూడముచ్చటగా ఉంది చర్చ్. దగ్గరకు వెళ్ళేసరికి లోపలినుంచి మ్యుసిక్ వినిపిస్తూంది.అరె, లేట్ అయినట్టూన్ననే అనుకుంటూ లోపలికి నడిచాను.అషురర్స్ ఎవ్వరూ కనిపించలేదు. ఐనా మనకి చర్చ్ కొత్తేమిటి అనుకుని ఒక బెంచ్లో కూర్చుని, రెండు ముక్కలు ప్రార్ధనచేసుకుని, కళ్ళు తెరిచాను. ఒక హిం (మన అన్నమయ్య కీర్తనల టైపు పాత పాట) పాడుతున్నారు. క్వయర్ టీం అంతా కొంచెం పెద్దవసువాళ్ళే ఉన్నారు అనుకుంటూ చుట్టూ చూసాను. అంతె, ఒక్కసారిగ షాక్ తిన్నాను! ఏదొ యునిఫాం ఆ అన్నట్టు అన్ని తెల్లటి ముగ్గుబుట్ట తలకాయలే తప్ప ఒక్క మామూలు తలకాయ కూడా కనిపించలా. పైగా పాటలు హింస్ మాత్రమే పాడారు. అస్సలే నాకు ఇండియాలో మాంచి హెప్ అండ్ హపెనింగ్ చర్చ్ అలవాటు. ఏంటి ఇది గాని ఏమైనా సీనియర్ సిటిజన్స్ కి స్పెషల్ చర్చ్ గాని కాదు కదా అనుకున్నా... కాని నాకు తెలిసి అలాంటి తెడాలేమీ ఉండవే!!! హ్మ్మ్... ఎంటొ ఇండియా లొ మన సంస్కృతి నాశనం ఐపోతుందీ అని అంటూ ఉంటారు కదా అలానె అమెరికా లొ చర్చ్లు కూడా ఇలా ఐపొయాయేమొ, ఇక్కడ యంగ్ వాళ్ళెవరూ చర్చ్లకి రారేమొ! దేవా ఏమిటి నాకీ పరీక్ష? ఫ్లీస్ నేను ఈ అబ్బయిల వెతుకుడు ప్రోగ్రాం చర్చ్లో మానేస్తాను గాని నాకు ఒక మంచి చర్చ్ చూపించు అని కమ్మిట్ ఐపోయాను.
***********************************************************************************
రోజులు ఇలా గడిచిపోతున్నై, నా అవుడియా ఇంకా వర్క్ అవుట్ అవ్వటం లేదు. ఒక రోజు మా బాసు నన్ను, హిమ ని పిలిచి చెప్పాడు, మేం కోర్ టీంతో 3 వీక్స్ వర్క్ చెయ్యలి అని. ఇద్దరం ఎగురుకుంటూ వెళ్ళాం. కోర్ టీం మానేజర్ వాళ్ళ టీం ని పరిచయం చేసాడు. హమ్మయ్య, వీళ్ళంతా అచ్చుముచ్చు అమెరికనులే పైగా అందరూ చూడ్డానికి బాగానే ఉన్నారు(కొంచెం అంకులిష్ గా ఉన్నా సరె). " Ruth will work with Andrew here!". Andrew! పెరు బాగుంది కదా అనుకున్నా, మనిషి కూడా బాగున్నాడు. మంచి హైటు వైటు, కండలు తిరిగిన చేతులు, కొటెరులాంటి ముక్కు, రంగు రూపు, తళ తళ లాడె తెల్లటి గుండు! అవును, నున్నటి గుండు! కాని గుండుదేముంది కావాలంటె జుట్టు పెంచుకోవచ్చు, లెకపోతె కావలసిన విగ్గు తగిలించుకోవచ్చు... నాకు ఓక్కే!! నాకు KT ఇచ్చేటప్పుడు వాడి లాప్టాప్ చూసాను. వాల్ పేపర్ లొ హార్లీ డెవిడ్సన్ బైక్ ఉంది. వాడిదెనంట...బాగా మాట్లాడాడు. సరె, ఆ రోజు ఫ్రైడే. నెను సీరియస్ గా పని చెసుకుంటున్నా లాబ్లో. వచ్చి పిలిచాడు కింద ఏదొ పార్టీ అవుతుంది రా అని. నువ్వు వెళ్ళు పని అయ్యక వస్తాను అన్నాను. ఊహూ, మళ్ళీ పిలిచాడు, నాకు పని ఐపోతే వీకెండ్ కి టెన్షన్ ఉండదు అని ఉంది. వాడు మళ్ళీ అన్నడు "Come on Ruth, it's free food out there!" ఆ ఎంటీ??? వోరేయ్, ఫ్రీ గా వస్తుంది కదా అని నన్ను రమ్మంటున్నవా.. హ్మ్మ్.. నేను రాను పో! అని చెప్పేసాను.ఇంకేముంది, వాడి మీద ఉన్న మొత్తం ఇమేజ్ పాడైపొఇంది.చీ... అసలు ఈ అబ్బయిలందరూ ఇంతె!!!
**********************************************************************************
ఏంటో నెను వెల్లిపోయే రోజు వచ్చేస్తొంది గాని, నా కల మాత్రం తీరటం లేదు. ఆఫీస్ లొ విస్తా రిలీజ్ పార్టీ. మా పక్క బిల్డింగ్ పార్కింగ్ అంతా కళ కళ లాడిపోతుంది. అక్కడ తినేవాడికి తిన్నంత, తాగేవాడికి తాగినంత, ఆడేవాడికి ఆడినంత మ్యుసిక్ ఇంక ఏవొ మస్సజులు, కాన్సర్టులు, మేజిక్లు, మాస్కులు, కర కరాల మ్యుసిక్ బేండ్లు... అబ్బా కళ్ళు చెదిరిపొయేలా ఉంది. మా గేంగ్ అందరికీ ఒక్కే ప్రోగ్రాం నచ్చట్లేదు అందుకని ఇద్దరిద్దరుగా విడిపోయి అన్ని కవర్ చేస్తున్నాము. నేను, నీలు ఒక కంట్రీ మ్యుసిక్ స్టాల్ దగ్గర చాలాసేపు ఉండిపోయాము. లేచి వచ్చేసరికి మా వాళ్ళెవరూ కనిపించలేదు. సరె, మనమే తిరుగుదాం అనుకుని ఇంకొ చోటకి వెళ్ళాం. అక్కడ ఒక బేండ్ ఏదొ రాక్ నంబర్లు వాయిస్తున్నారు. స్టేజ్ ముందు ఒక గుంపు ఊగుతూ తూగుతూ ఉన్నరు, కొంతమంది తెగ చిందులేసేస్తున్నారు. ఆహా! కర్రెక్ట్ ప్లేస్కి వచ్చాం అనుకున్నాం. చుట్టు మాకు తెలిసిన వాళ్ళు గాని, మేం తెలిసిన వాళ్ళు గాని లేరు. అబ్బ, అమెరికా వచ్చినా ఒక్క పబ్కి కూడా వెళ్ళలేదనె లోటు లెకుండా ఆ డాన్స్ ఏదొ ఇక్కడె చేసేస్తె పొలా, అని ఇద్దరం ఒక మూలకెళ్ళి మొదలెట్టాం... ఫుల్ల్ తీన్మార్...అలసిపోయి పక్కకు వచ్చేసరికి, ఎవరొ వచ్చి మాకు ఫొటో తీస్తాము అని ఆఫర్ చేసారు. సరె అని అతనితో మాట్లాడుతున్నాం. అప్పటి వరకు అక్కడే ఒక టేబిల్ దగ్గర కూర్చుని ఉన్న ఒక అతను వచ్చి అన్నడు "you guys are from building #.... right?" "yeah" చెప్పాం. "I've seen you guys there". "oh! you work there too". "yup! hey, will you have dinner with me some time? " "హా???" నీలు నోరు తెరుచుకుని నా వైపు చూస్తుంది నెనేమంటానొ అని.నాకు అస్సలు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎలాగో నట్టుకుంటూ చెప్పాను " well, I don't think it's a good idea". "come on.... one dinner ", "ok, i will think about it " ఏదొ చెప్పి తప్పించుకుందామని చెప్పాను."sure, do call me up... my office is #...". "yeah sure,nice meeting you ,bye! " చెప్పి పరిగెత్తుకుని వచ్చేసాం అక్కడనుండి. తర్వాత ఆలొచిస్తే అనిపించింది, ఎందుకు అలా చెప్పాను? అక్కడ అందరూ తాగేసి ఉండగా, ఆ అబ్బాయి ఒక్కడే సోబర్ గా ఉన్నాడు. చూడ్డానికి కూడా పెద్ద బాధాకరంగా ఏం లేడు. మరి? ఏమొ మరి, నాకు అంత సీన్ లెదేమొ.... ఐనా ఇలాంటివన్ని సినీమాల్లోనే గాని, నిజం లైఫ్లో వర్క్ ఔట్ అవుతాయా ఏంటి???
**********************************************************************************
ఐనా, వేరెవాళ్ళు వచ్చి నన్ను అడిగేదేంటి, నేనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా...వెంఠనే నా మెదడులో ఒక మెరుపు....రోజు ఆఫీస్ రాగానె ఎవరు ఆన్ లైన్ లొ ఉన్నాడో లెదో అని చెక్ చేస్తానొ, ఎవరు కనిపిస్తారొ అని పని ఉన్నా లేకపోయినా వాడి ఆఫీస్ ముందు తిరిగుతానొ, ఎవడు పొరపాట్న పేంట్రీ లో హాయ్ చెప్తే నేను ఆ రోజంతా భూమిమీద నడవనో... వాడే, వాడే గ్రెగ్! మనిషి ఆరున్నర అడుగుల పొడుగుంటాడు, దానికి ఇంచుమించు సమానమైన వెడల్పు కూడా ఉంటాడు. పింక్ గా ఉండే బూరెబుగ్గలు, వారం రోజులు షేవ్ చెయ్యని గడ్డం, ఇంకా మీదనించి కింద వరకు ఒక షెర్లాక్ హొంస్ కోట్. కాని నా ఆవేశానికి కారణం ఇవేవి కాదు. నేను ఎప్పుడు వైస్ట్ లెంగ్త్ జుట్టు మైంటైన్ చేస్తాను. నాది నల్లటి వత్తైన సిల్కీ జుట్టు. నా జుట్టు కి చాలా మంది ఫాన్స్, ACs... మరి అలాంటి జుత్తుకి సరితూగే జుత్తు మన గ్రెగ్ సొంతం. మరీ నా జుట్టంత పొడుగు కాకపోయినా, ఒకమాదిరి పొడుగ్గా, వత్తుగా, సిల్కీగా.... మిలమిలలాడె బంగారు జుత్తు. అవును, వాడి బ్లాండ్ హైర్ చూసి నేను కుళ్ళుకోని రోజులేదు. వాడు దాన్ని ఒక్కోసారి పోని వేసుకునే వాడు, ఒక్కోసారి సగం జుట్టు కి బాండ్ పెట్టేవాడు, ఒక్కోసారి ఫ్రీ గా వదిలేసేవాడు. ఏం చేసినా ఎలా ఉన్నా ఆ జుట్టు మాత్రం సూపర్!!! కాని, జుట్టు కోసం ఒక అబ్బాయి నచ్చేయవచ్చా? ఎందుకు కాదు? మరి ఆ అమ్మాయి జుట్టు చూసి పెళ్ళి చేసుకున్నాను అనే స్టేట్మెంట్ ఎన్ని సార్లు వినలేదు? కాని.... ఏమొ, ఈ కంఫూషన్ లొంచి బయటపడేలోపు నా ట్రిప్ ఐపోయింది. ఇంక తన గురించి తెలుసుకునే అవకాశం గాని, ఆవేశం గాని లేవు. ప్చ్చ్!!!
***********************************************************************************
టట్టడ... టట్టడ... టట్టడ...టడట్టడట్టంటట్టండం...టడట్టడట్టంటట్టండం......
ఆబ్బా, మచి నిద్రలో ఎవర్రా బాబు డిస్టర్బెన్స్... పేరు చూస్తే తబి... హ హా అనుకుని, ఫోన్ లిఫ్ట్ చెయ్యకుండా దిండుకింద పెట్టేసి పడుకున్నా...
అక్కడ తబి కి నా డయలర్ టోన్ లో పాట వినిపిస్తుంది....

ఓ హో హో హో...
మేడ్ ఇన్ ఇండియా....మేడ్ ఇన్ ఇండియా....
ఎక్ దిల్ చాహియే ...మేడ్ ఇన్ ఇండియా.....

19 comments:

Raghav said...

సింపుల్ గా చెప్పాలంటే కెవ్వు కేక :)
కాని ఇండియా లో అబ్బాయిలకు అన్యాయం చేస్తున్నారు, నాకేం నచ్చలా

బ్లాగులో కాయ said...

ఇది దారుణమండీ...

Start from 4:03

http://www.youtube.com/watch?v=ygZMWHUa6zo

శిశిర said...

Good... Made in India :):)

Ram Krish Reddy Kotla said...

రుత్...ఇదే కదా మీరు...ఇదేమన్నా షార్ట్ కట్టా??...అంటే మీ పేరు రుతిక..లేక ఇంకేమన్నా అయి ఉంటుందా??..నేను ఒకసారి నా టెన్త్ క్లాసులో అనుకుంటా తెలిసినవాళ్ళ పెళ్ళికి అని అనకాపల్లి వచ్చాను...అపుడు ఎందుకో ఆ ఊరు చాలా బాగా నచ్చింది నాకు...ఇక మీ టపా టపటపాయించింది...తెల్ల తోలు ఉంటుందనే గాని, మన అబ్బాయిల ముందు వాళ్ళు అసలు పనికివస్తారా??...నో వే...రేలషన్ అనేది ఒక గేమ్ లా ఉంటుంది వాళ్లకి..మన అంట సీరియస్ గా ఉండరు రేలషన్ లో...అది వాళ్ళ కల్చర్ అనుకో...మనకి వాళ్ళకి పడదు...పడమటి సంధ్యారాగం లాంటి సినిమా నిజజీవితంలో చాలా అరుదు...కాకపోతే మీరు రాసిన తీరు నాకు నచ్చింది...సున్నిత హాస్యంతో రాసారు...అది నాకు చాలా నచ్చింది...వీలున్నప్పుడు నా బ్లాగ్ లోకి కూడా ఓ లుక్ వెయ్యండి...

Ram Krish Reddy Kotla said...

ruth gaaru, mottaniki me posts anni chadivesa oke sari....chala nachai naku...

కొత్త పాళీ said...

Ruth rocks :)

KumarN said...

Great style and attitude. This is the first time I read your blog and I went back and read all posts.

People around you must be lucky.

మురళి said...

చాలా చాలా బాగుందండీ.. కాకపొతే మీరింత అరుదుగా రాయడమే బాలేదు.. అమెరికా కబుర్లు వినడానికి మేమంతా సిద్ధమేనని మరోమారు మాటిస్తున్నాను.. అన్నట్టు ఈ టపా మీద అప్పారావుగారి అభిప్రాయం కొంచం కనుక్కుని చెబుతారా? :):)

Ruth said...

@ రాఘవ్, ఎండింగ్ మిస్ అయ్యారా? చివరకు డిసైడ్ చేసింది ఇండియా వాళ్ళనే కదండి !!!
@ రాజా, ఏమిటండి దారుణం? everything is fair in love and war కదా :)
@ శిశిర, ధన్యవాదాలు. మీ బ్లాగ్ చూసాను కాని కామెంటే టైం దొరకలేదు.
@ కిషన్ రెడ్డి గారు, చాలా థాంక్స్. నాకైతే అమెరికా కన్నా, అనకాపల్లే బాగుంటుంది :)
హ్మ్మ్... పడమటిసంధ్యారాగం.... ఫాంటసీ !!! కాని అక్కడక్కడా NRIల పిల్లలు అమెరికన్స్ ని పెళ్ళిచేసుకోవటం విన్నాను.
మీ ఓపికకు మరోసారి ధన్యవాదాలు.

Ruth said...

@ కొత్తపాళి గారు, మీ కామెంట్ రాక్స్ టూ ! :)
@ కమార్ గారు, చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేసారు. పక్క వాళ్ళు లక్కీనో కాదో తెలీదు గానీ, చదివేవాళ్ళకు బోరుకొట్టకుండా ఉంటే చాలు.
@ మురళి గారు, మీకో సీక్రెట్ చెప్పేస్తున్నా.... ఇంతకు ముందు నేను బెంచ్లో ఉండెదాన్ని సో, అన్ని బ్లాగులు చదవటం, కామెంటటం... అప్పుడప్పుడు రాయటం కుదిరేది. ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసింది మరి :(

Ruth said...

ఓహ్ మర్చిపొయాను.. మా అపారావ్ గారికి ఈ విషయాలన్నీ కొంచెం ఇంచుమించు గా ముందే చెప్పేసాను. కాని, నిన్న ఆ జుట్టు వాడిగుంచి మాత్రం కొంచెం అనుమానం గా అడిగారు మళ్ళీ... ఐనా ప్రేమ ఉన్న దగ్గర అనుమానం అసమంజసం కాదు కదా :)

Malakpet Rowdy said...

Too good!!!!!

Malakpet Rowdy said...

Are you from AKP too? I am an alumnus of AMAA High School!!!!

Malakpet Rowdy said...

Actually my mom retired as an Asst Prof in Telugu from AMAL COllege

Ruth said...

Hi, sorry i don't check my blog often :)
yes, I am from AKP too. n I passed out from AMAA. I think I saw you in some orkut community long time back. I even studied in AMAL coll. but my second lang was Hindi.

మధురవాణి said...

మీ అమెరికా అబ్బాయిల వేట (మీరిదే పదం వాడారు కదా అని :-) భలేగా ఉందండీ! సరదా సరదాగా సాగిపోయింది. nice post!

Ruth said...

@ మధురవాణి గారు, హ్మ్మ్... మీకు సరదాగానే ఉంటుంది అండీ, కాని నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు? నేను వచ్చిన తరువాత మా కసిన్స్ అంతా నన్ను ఎన్ని మాటలన్నారో ! నాకు టాలెంట్ లేదు, నేను వేస్ట్ కేండేట్, నా వల్ల అవ్వదు.... ఇలా.......

:)

రాజ్ కుమార్ said...

హహహ.. పోస్ట్ చాలా బాగా రాశారండీ.. కొన్ని పదప్రయోగాలకి భలే నవ్వుకున్నా..
మీ బ్లాగ్ ఇదే చూడటం నేను. .టేంప్లేట్ కూడా సూపర్గా ఉందండీ ;)

Kottapali said...

చాలా రోజుల తరవాత మళ్ళీ చదివాను. అద్భుతంగా రాశారు. గ్రెగ్ జుత్తునీ మీ జుట్టునీ తలుచుకుంటే .. .. తల్చుకుంటే .. .. అవతార్ సినిమా గుర్తొచ్చింది :)