అసలు ఈ శీర్షిక ఆరు పుస్తకాలు అరవై రూపాయలు ఆని ఉండాల్సింది. కానీ.....
ఈ మధ్యనోసారి కొండాపూర్ రోడ్డు మీదవెళ్తూంటే కనిపించింది, చిన్న సందులాంటి పుస్తకాల షాపు. అసలు చెప్పాలంటే, సందు కూడా కాదేమో, ఒక మెట్ల వరసకింద స్థలం+ ఒక మనిషి మాత్రమే దూరగలిగే సందు. ఇదీ ఆ షాపు. నేను చూడకుండా వెళ్ళిపోయేదాన్నే, కాకపోతే ఆ రోజు కాస్త తీరికగా నడుస్తున్నానేమో, రోడ్డు మీద నిలబెట్టిన పుస్తకాల స్టాండు చూసి ఆగాను. సెకండు హాండ్ వి, ఇంకా కొత్తపుస్తకాలు కూడా వున్నట్టే అనిపించాయి. నేను పేర్లు చదువుతుంటే, షాపువాడు లోపలికి రమ్మని ఆహ్వానించాడు. సరే చూద్దాం అని జాగ్రత్తగా సందులోకి దూరితే, లోపల చాలానే పుస్తకాలు ఉన్నాయి ఒక అర నిండా తెలుగు పుస్తకాలు కనిపిచే సరికి వెంటనే నేను బ్ల్లాగుల్లో చదివిన తెలుగు పుస్తకాల సమీక్షలూ గుర్తువచ్చి, నేను కూడా తెలుగు సాహిత్యాన్ని ఆదరించే టైము అర్జంటు గా వచ్చేసిందని నాకు అర్ధమైంది.
కాని అసలు చిక్కు అక్కడే వచ్చింది! ఆ తెలుగు పుస్తకాల అర నిండా కొట్టొచ్చినట్టు కనపడుతున్నవి మూడే పేర్లు, యండమూరి, యుద్ధనపూడి, ఇంకా మధుబాబు. మధుబాబుని ముందు లిస్ట్లోనుండి తీసేయొచ్చు, కానీ మరీ యండమూరి, యుద్ధనపూడి అంటే? నా తెలుగు సాహిత్య పఠనారంభం మరీ ఇంత నాటకీయం గా ఉందాలా అని తీవ్రంగా ఆలోచించుతుంటే, అప్పుడు కనిపించింది, ఒక మూలగా తోసేసిన పుస్తకం. మన నెమలికన్ను గారి అభిమాన రచయిత విరచితం....మహల్లో కోకిల. గమనిక : నాకు తెలుగు సాహిత్యం గురించి తెలిసింది చాలా తక్కువనిన్నూ, మరియు, నాకు తెలిసిన పుస్తకాలు/రచయితలు చాలా వరకు నెమలికన్ను బ్లాగు ద్వారానే తెలిసినవనిన్నూ నా గోల వాటిగురించే అనిన్నూ ఇందుమూలంగా యావత్ నాబ్లాగు చదువరులకు తెలియపరచడమైనది.
మహల్లో కోకిల: పుస్తకం డెబ్భై రూపాయలు. దీని మీద డిస్కౌంట్ ఉందా అని అడిగితే, అరవై ఇవ్వండి మాడం, యాభై తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు షాపు వాడు. ఒహ్హో! ఇక్కడ పుస్తకాలు అద్దెకి ఇస్తారన్నమాట! అప్పుడు వెలిగింది నా ట్యూబు లైటు. సరె, మరి పుస్తకం నచ్చితే, అరవై రూపాయలకు ఉంచేసుకోవచ్చు లేకపోతే, రెండు వారాల్లో తిరిగిచ్చేయాలి. ఓక్కే అని పుస్తకం తీసుకుని బయట పడ్డాను. పుస్తకం గురించి చెప్పడానికి నాకు పెద్దగా ఏమీ లేదు గాని, కొంచెం నిరాశపరిచిందనే చెప్పాలి. ముఖ్యం గా నాయిక గారు, ఆ పగటి వేషగాడితో(రాముడు?) అంత ఎక్కువ అటాచ్మెంటు అంత తక్కువ టైములో కలిగించుకోవటం కన్విన్సింగ్ గా లేదు. సరే, మళ్ళీ ఆదివారం పుస్తకం ఇచ్చ్ద్దామని వెళ్ళాను. అదిగో అప్పుడు వచ్చింది నాకీ అద్భుతమైన అవుడియా !!! ఆ షాపు వాడిచ్చే యాభై తీసుకోకుండా మళ్ళీ ఇంకో పుస్తకం అలా అలా అరవై అయ్యే వరకు ఆరు పుస్తకాలు చదివేసి, ఆరు పుస్తకాలు - అరవై రూపాయలు అని టైటిల్ తో ఒక టపా వెయ్యాలని. దాన్లో ఆ ఆరు పుస్తకాలనీ మరీ నాలుక తిరిగిన విశ్లేషణ కాకపోయినా ఏదో నాకొచ్చినట్టు విశ్లేషించాలనీ....
ఒక పుస్తకం ఐపోయింది కాబట్టీ ఆ తరవాత ఏం తీసుకోవాలీ అని తెగ చించడం మొదలుపెట్టాను. పుస్తకాల అర చూస్తే ఒకే పేరు మళ్ళీ మళ్ళీ నా కళ్ళల్లో పడుతూంది. ఎంత కాదనుకున్నా, తెలుగు వాళ్ళని ఒక టైములో ఉర్రూతలూపిన పాపులర్ రచయిత, ఇంకా ఈ మధ్యనే నటుడు కూడానూ ఐన యండమూరి గారి ని ఇంక తప్పించుకోలేను అనిపించింది. అతని పుస్తకాలన్నిట్ల్లోను మంచిది, పాపులర్, ఇంకా మందాకిని అనబడే నాయిక ఉన్న "ఆనందోబ్రహ్మ" తీసుకోవడం జరిగింది. ఈ పుస్తకం వెల అరవై, కాని పది డిస్కౌంటు పోను యాభై కాబట్టి, షాపువాడికి నాకు మధ్య ఏ విధమైన ఆర్ధిక లావాదేవీలు లేకుండానే, పుస్తకం నా చేతికొచ్చింది. ఈ పుస్తకం ద్వారా నేను తెలుకున్న కొన్ని పచ్చి నిజాలు:
తెలుగులో ఎన్నో సంవత్సరాల క్రితమే సైన్సు ఫిక్షన్ రాయబడింది (కథా కాలం 2050 లో మొదలైయ్యింది మరి)
ఆ రోజుల్లో కూడా మాఫియా గూండాల్ని వాళ్ళు పెట్టుకునే టోపీల ద్వారా గుర్తు పట్టొచ్చు.
అప్పటికల్లా మంగలివాళ్ళు పెద్ద కోటీశ్వరులు ఐపోతారు (ఇప్పటికే అది జరిగేట్టుంది- మొన్న నేను హైర్ కట్ చేయించుకున్నపుడు వచ్చిన బిల్ చూస్తే)
ఇంకా, ఆ రోజుల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ మధ్య శారీరక సంబంధాలూ, అవి తల్లిదంద్రులకు తెలియడాలూ, లెక్క తప్పినప్పుడు అబార్షన్లూ అన్నీ కామన్ అయిపోయినా, ఒక వేళ అబార్షన్ ఇష్టం లేకపోతే, ఆ అబ్బాయినే పెళ్ళి చేసుకోవాలి.
ఇంకా చాలా.... కాని ఒకటి మాత్రం నిజం, ఈ పుస్తకం నన్ను అంతగా నిరాశపరచలేదనే చెప్పాలి.
మళ్ళీ ఆదివారం, ఈ సారి ఆన్ ద ఫ్లై కాకుండా, ముందే ఏ పుస్తకం తీసుకోవాలో అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలని, బ్లాగులు ముందేసుకుని కూర్చున్నా. తీవ్రంగా గాలించి ఒక లిస్ట్ తయారు చేసా... ఆ లిస్ట్ నాలాగా తెలుగు సాహిత్యాన్ని ఆదరిద్దామనుకునే వారి సౌలభ్యం కోసం ఇక్కడ: " వెన్నెల్లో ఆడపిల్ల - యండమూరి", "సెక్రెట్రీ - యుద్ధనపూడి", "అందమైన జీవితం - మల్లాది" (ఇక్కడ నాకో సందేహం.... చాలా మంది మల్లాదిలు కనిపిస్తున్నారు. ఈ పర్టిక్కులర్ రచయిత పూర్తిపేరు? ) సరే, లిస్ట్ చేతధరించి పొత్తముల షాపునకేగితిని ! కానీ అయ్యో ! యుద్ధనపూడి, మల్లాదిల పుస్తకాలు(లిస్ట్లోవి) అక్కడ లేవు. అయ్యారే, ఏమి సేయవలయును ? నెను, పుస్తకాలు షాపు వాడూ దీక్షగా ఎంత వెదికిననూ తుమ్ములు వచ్చుచున్నవి తప్ప పుస్తకములు దొరుకుటలేదు. హ్మ్మ్... ఇంక నా ఆఖరి ప్రయత్నం గా యండమూరివారిని మళ్ళీ ఆహ్వానించక తప్పలేదు. ఈ సారి నాతోపాటు ఇంటికొచ్చింది వెన్నెల్లో ఆడపిల్ల ! ఈ సారీ నన్ను రచయిత నిరాశపరచలేదనే చెప్పాలి. నాకు తెలీని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను ముఖ్యం గా, రచయిత దగ్గర, చెస్స్ లోనూ, టెలిఫొన్ ఎక్ష్చేంజ్ రంగంలోను ఇంకా గణితంలోను మంచి సమాచారం ఉంది.ఆ రోజుల్లో ఒకే ఊరిలోని టెలెఫొన్ నంబర్లు వేరే వేరే అంకెలతో మొదలయ్యేవి....
నేను పుస్తకం మార్చ వలసిన ఆదివారం వచ్చేసింది గాని, నా చిన్న బుర్ర ఇంక నేను ఈ సమాచార భాండాగారాల్ని భరించలేనూ అని మొర్ర పెట్టడం మొదలెట్టింది. సరే, ప్రస్తుతానికి ఒక విరామం ప్రకటిద్దాం అని, ఆడపిల్లని జాగ్రత్తగా దిగబెట్టి, నా ముప్పై రూపాయలు పుచ్చుకుని, షాపు వాడు నిరాశగా చూస్తుండగా బయటికొచ్చేసాను. కాని, కనీసం ఈ మూడు పుస్తకాలతోనైనా టపా రాస్తే, నేను పడిన శ్రమకు అర్ధం పరమార్ధం ఉంటాయని.... ఇలా....
ఇంతే సంగతులు,
చిత్తగించవలెను.
తాజా కలం: మిగతా పుస్తకాలూ త్వరలోనే చదివి మళ్ళీ బ్లాగుచెసుకోవాలని ఆశిస్తున్నాను

9 comments:
మీకు మల్లాది గారి మరియు మధుబాబు గారి ఈ-పుస్తకాలు కినిగెలో లభిస్తాయి. అక్కడ కూడా అద్దెకు తీసుకోవచ్చు! కినిగె
యండమూరి గారి పుస్తకాలు మొదలుపెట్టాక మధ్యలో ఆపనివ్వవండి.
ee shop ekkada undo address correct ga cheppagalaara? please
"మల్లాది వెంకట కృష్ణమూర్తి" అనేది మీరడిగిన రచయిత పూర్తి పేరు. "మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు" పాతకాలం రచయిత, సినీ గీత రచయిత.
@ oremuna గారు, కినిగె అప్డేట్స్ చూస్తున్నాను గాని ఇంకా యూస్ చెయ్యలేదు.
@ మందాకిని గారు, అవును, యండమూరి గారికి బ్లాగ్లోకంలో చాలా ఫాన్స్ ఉన్నారు :)
@ వరం గారు, మీరు కొండాపుర్ సిగ్నల్ నుంచి కొత్తగుడా వైపు వస్తుంటే, ఎడమవైపు షెవర్లే షొరూం బిల్డింగ్, బెల్లెజా బిల్డింగ్ తరవాత కొన్ని బడ్డీ షాపుల్లాంటివి ఉంటాయి. అక్కడే ఉంది ఈ షాపు. తెలుగు పుస్తకాలు బాగానే ఉన్నాయి (నేను టపాలో చెప్పినవి ఇంకా కొమ్మూరి, సూర్యదేవర ఎత్చ్..)
@ కొత్తావకాయ గారు, థాంక్స్. ఈయనే ఈ మధ్య సాక్షిలో ట్రావెలోగ్ రాస్తున్నట్టున్నారు. మరొకసారి పేరు చెక్ చేసుకుంటాను.
బాగున్నాయండీ మీ మూడు పుస్తకాల కబుర్లు. ;)
మధుబాబు గారిని లిస్ట్ లోంచి తీసేస్తారా? హన్నా...! (ఒకప్పుడు భీభత్సంగా చదివేసేవాడిని లెండీ. ;))
@ రాజ్ కుమార్ గారు, చాలా థాంక్స్. నేను కూడా చిన్నప్పుడు మధుబాబు షాడో నవల్స్ తెగ చదివేదాన్ని !
btw, ఇంకో రాజ్ కుమార్ గారున్నారు, ఆయన కూడా ఏటికొప్పాక గురించి రాసేరు. మీరు అతను ఒక్కళ్ళేనా వేరు వేరా ?
Vennello aadapilla also gives good information about Chess.
Post a Comment