మా ప్రాజెక్ట్ లో అదే రోజు అదే ప్లేస్ కి వెళ్ళ్తున్న మిగతా వాళ్ళకి, నాకు కలిపి సేం రూట్ లో టిక్కెట్స్ వచ్చాయి. హమ్మయ్య, వాళ్ళలో ముందుగా ఒకసారి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు భయం లేదు అనుకున్నా. మమ్మీ డాడీ, తమ్ముడు వచ్చారు టా టా చెప్పడానికి. తెల్లవారి రెండు గంటలకి ఫ్లైట్ ఐతె, మేము పది గంటలకే ఏర్పోర్టులో ఉన్నాం మిగతావాళ్ళ కోసం ఎదురుచూస్తూ. వాళ్ళు ధీమాగా పదకొండున్నరకి దిగారు. అప్పటికి మమ్మీ వాళ్ళకి విసుగు వచ్చింది. తమ్ముడు విసిటర్స్ లాంజ్ టిక్కెట్స్ తెస్తానని చెప్పి ఇప్పటికి పత్తాలేడు. సరే, ఆడపిల్ల ఒక్కటె వెళ్తుంది కదాని అందరూ నాకొసం సహిస్తున్నట్టున్నారు. మిగతా వాళ్ళు రాగానే, ఇంక వాళ్ళు వచ్చేసారు కదా, మేమెందుకులే, ఎలాగూ మీరు ప్లేన్ ఎక్కడం కనపడదంట కదా, చాలా టైమైంది, ఇలా నసగటం మొదలు. అమ్మా, మీ కూతురు మొదటి సారి అమెరికా వెళ్ళ్తుంటె ఇంత కూడ చెయ్యలేరా అస్సలే నేను ఫ్లైట్ ఎక్కటం ఇదే మొదటిసారి అని సెంటిమెంటల్‌గా ఒక్క డవిలాగ్ వదిలాను. అంతె, అందరూ డిసైడ్ అయ్యరు, ఇది మనల్ని వదలదు, ఈవాళకి నిద్ర మీద ఆశ వదిలేసుకొవాలి అని. ఇంక అందరూ లోపలికి వెళ్తున్నారు, మా టీం మేట్ వాళ్ళ నాన్న గారు ఏడుస్తున్నరు, ఆ అమ్మయి కూడా కళ్ళు తుడుచుకుంటుంది. నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు నేను కూడా ఏడవాలా? (అసలె, ఆ అమ్మాయి ఇది రెండోసారి వెళ్ళటం). మా వాళ్ళ వైపు చూసాను, అందరూ క్లోస్ అప్ ఏడ్ లో లాగ నవ్వుతూ చెయ్యి వూపుతున్నారు. మమ్మీ చెప్పారు "చిన్నీ, ధైర్యం గా వెళ్ళి, ధైర్యం గా రా". శుభం! నేను అమెరికా కి కాకుండా, ఆఫ్రికాకి, అండమాన్ కి లేదా ఆర్కిటిక్ కి వెళ్తున్నా సరే, మా మమ్మీ ఇదే విధం గా నాకు వీడ్కోలు ఇస్తారు.
మూడు నెల్లు గిర్రున తిరిగాయి. అమెరికా లో పనులన్నీ (అంటె, మేమెళ్ళిన ఊర్లో విశేషాలన్ని చూడటం, ఫొటోలు తీసుకోడం, షాపింగ్, అప్పుడప్పుడు కొంచెం ఆఫీస్ పని) అయ్యాక, నేను ఇండియా వచ్చేసాను. నేను అనుకున్నట్లె, నన్ను రిసీవ్ చేసుటానికి ఏవరూ రాలేదు. నా కొలీగ్, ఏర్పొర్ట్ పక్కనే హాస్టల్ లో ఉన్న ఒక కసిన్ వచ్చారు. రెండు రోజుల తర్వాత ఆఫీస్ కి ఒక వారం సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను. అందరూ నేను తెచ్చిన గిఫ్ట్ లు చూసుకున్నారు. చాకొలెట్లు తిన్నారు. పక్క వాళ్ళకి పంచారు మా అమ్మాయి అమెరికా నుంచి తెచ్చింది అని. రెండు రోజులు తర్వాత అమ్మ, వైజాగ్ వెళ్తాను వాళ్ళకొసం తెచ్చినవి ఇవ్వాలి కదా అన్నను. ఓకె, అక్కడ మా కసిన్స్ కి తెచ్చిన గిఫ్ట్‌లు కూడా ఇచ్చేసాను.
ఏమె, అమెరికా లో పబ్ కి వెళ్ళవా? ఊహూ లేదు.
ఎవరైనా అబ్బాయిలు(అంటె, అమెరికా వాళ్ళు) ఫ్రెండ్స్ అయ్యరా? ఊహూ అస్సలు ఎవరితోనూ మాట్లాడనే లేదు.
అక్కడ మిని స్కర్టులు వేసుకున్నావా? ఊహూ...
అసలు ఏం చేసావ్ అక్కడ? ... నేను.. నేను ఆఫీస్ కి వెళ్ళాను, షాపింగ్ మాల్స్ కి వెళ్ళాను, ఇంక స్నోలో ఆడాను, జూ కి వెళ్ళాను, వంట నేర్చుకున్నాను, ఆ.... బొల్డు ఫొటోలు తీసుకున్నాను (4 GB) చూపిస్తాను ఉండు.......
అమ్మో!!!
మా వాళ్ళంతా మాయం.ఇంటికి వచ్చాను.
మమ్మీ, నేను అమెరికా లొ ఉన్నప్పుడు...మ్మ్, వంట చేసాక చెప్దువు గానిలే.
డాడీ ఈ ఫొటోలు చూడండి ఎంత బాగుంది కదా స్నో...ఆ, ఏముంది అంతా TVలో చూసేదే కదా, నాకు బయట పని వుంది మళ్ళీ చూస్తానులే.
ఆక్కా, పిల్లల బట్టలు బాగున్నై కదా... మన పాంటలూన్స్ లొనే దొరొకుతున్నాయి ఇలాంటివన్నీ.
ఒరే..... అబ్బా, ఏంటి నీ అమెరికా గోల, అప్పటికి ఏదొ నువ్వే అమెరికా వెళ్ళినట్టు ఎన్ని ఫొటోలని చూస్తాం?
హ్మ్మ్ ఇంక అందరూ ఇలా direct gaa చెప్పేసరికి నా అమెరికా అనుభవాలన్నీ నాలోనే అణచిపెట్టేసాను. కాని, ఈ మూడు ఏళ్ళుగా నాలోనె రగులుతున్న ఈ కసి అత్యంత సులభం గా సేఫ్ గా తీర్చుకునే మార్గం నాకు ఇప్పుడు దొరికింది. ఇ హ హ్హ హ్హా హ్హా (మనసులో) ఇప్పుడు నా అమెరికా కబుర్లు అన్ని ఇక్కడ చెప్పేస్తాను. అప్పుడే నా మనసుకు శాంతి !
******* ఇది అంతం కాదు ఆరంభం !!! ******************
29 comments:
అనకాపల్లిలో పుట్టినంతమాత్రాన ఇంఫీరియర్ అవ్వాల్సిన పని లేదు. అమెరికాలో పుట్టడం గొప్ప కాదు. నేను రెండు వేలు జనాభా ఉన్న పల్లెటూరిలో పుట్టాను. నేను పుట్టిన ఊరు వండువ, వీరఘట్టం మండలం, శ్రీకాకుళం జిల్లా. అమెరికాలో కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇది జోక్ కాదు, నిజం. అడుక్కునే వాళ్ళని అక్కడ pan handlers అంటారు. చికాగో నగరంలో pan handling నిషిద్ధం. ఓర్లాండో పట్టణంలో pan handling చెయ్యాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. మా వండువ గ్రామంలో అడుక్కునే వాళ్ళు లేరు. అప్పుడప్పుడు వేరే గ్రామం నుంచి దాసరివాడు వచ్చి పాటలు పాడుకుంటూ బియ్యం అడుక్కుంటాడు. నేను పల్లెటూరి నుంచి వచ్చానని చెప్పుకోవడానికి సిగ్గు పడను. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా జోకులు వేసే వాళ్ళు USA అంటే United States of Amudalavalasa అని. ఒకప్పుడు ఆముదాలవలస పల్లెటూరు. ఇప్పుడు ఆముదాలవలస మునిసిపల్ టౌన్. మీ అనకాపల్లి కూడా ఇప్పుడు వైజాగ్ మెట్రోలో భాగమే కదా. వైజాగ్ మెట్రో ఎలమంచిలి\అచ్యుతాపురం వరకు ఎక్స్టెండ్ అయ్యిందనుకుంటాను.
జంధ్యాల గారి సినిమా గుర్తొచ్చిందండీ మీ బ్లాగు పేరు చూడగానే.. బాగుంది టపా.. చెప్పెయ్యండి మీ అమెరిక కబుర్లు.. వినడానికి మేము రెడీ.. అన్నట్టు తెలుగు టైపింగ్ మొదట్లో అందరినీ ఇబ్బంది పెడుతుందండి.. కొన్నాళ్ళకి సులువుగా వచ్చేస్తుంది... కానివ్వండి...
హహహ!! ఇప్పుడు అమెరికా ట్రిప్పులు అలా ఐపొయ్యాయి!బాగా సరదాగా రాసారు. O.K మేము రెడీ చదవటానికి మీదే ఆలస్Yఅం.
:):)ఇయ్యాల అమెరికా ఎళ్ళిరావటం అంటె అనకాపల్లి ఎళ్ళొచ్చినంత తేలిక.
జనాల్లోకూడ ఇంతముందులా కాకుండ గిఫ్ట్‌ల[చిన్నచిన్నవి మాత్రమే సుమా] మీద మోజు తగ్గింది, గమనించారా?
కబుర్లు చెప్పటం కష్టం కాని వినటానికేమి మీరు కానియ్యండి మేము రెడీ :)
చాలా సరదాగా ఉంది మీ పోస్ట్. మీరు బ్లాగ్లోకానికి కొత్త అనుకుంటా... ఆ మొదట కామెంటినాయనని చూసి భయపడవద్దు. ముందు ముందు మీరే అర్ధం చేసుకుంటారు. (ఇదేదో జెమినీ సిన్మాలో లెక్చరర్ మొదటిరోజే ప్రిన్సిపాల్ మాట అస్సలు వినొద్దు అని చెప్పినట్లుంది కదా...)
మీ అమెరికా విశేషాలని ఇదే స్టైల్ లో చెప్పాలి మరి...
@ ప్రవీణ్ గారు: నేను ఆస్సలు ఫీల్ అవ్వనండి మాది అనకాపల్లి అని. లేకపొతె, ముందుగా అదే ఎందుకు రాస్తాను బ్లాగ్‌లో? ఇప్పటికీ నేను మాది అనకాపల్లి అని చాలా ఒపెన్ గా చెప్తాను అందరికీ.
@ మురళి గారు, చాలా ధన్యవాదాలు. ఇప్పుడు లేఖిని తో చాలా సులువుగా ఉంది తెలుగు. పైగా, నేను మామూలుగా తెలుగు రాస్తె, అంటె పెన్ తొ, ఆ రాత నాకు కూడా అర్ధం కాదు తర్వాత. అందుకే, నాకు ఈ ఇ-తెలుగు తెగ నచ్చేసింది.
@సునిత గారు : చాలా ధన్యవాదాలు. ఇంక చూసుకొండి మరి ఇంత ప్రోత్సాహం ఇచ్చాక నేను ఎలా ఉండగలను రాయకుండా?
@భాస్కర్ గారు: ధన్యవాదాలు. నిజమేనండి, నేను ఎంతొ అపురూపం గా తెచ్చిన బట్టలు మా అక్క పిల్లలకి ఇంట్లొ వేసేది. మా డాడీ ణెను తెచ్చిన cannon camera(450$) ని పక్కన పడెసారు. ఇంక, ఒక్కొ గ్రాము గ్రాము వేయిట్ చూసి ఇరికించి ఇరికించి తెచ్చిన చాకొలట్లు....హ్మ్మ్ ఎందుకులెండి ఇప్పుడు అవన్ని మళ్ళి తవ్వుకోవటం.....
@ శ్రావ్య గారు, చాలా ధన్యవాదాలు. చెప్పడానికి నేను రేడీ నే కాకపొతె, మళ్ళి ఎక్కువైతె, రాసే వాడికి
చదివేవాడు.... అంటారేమొ? ( ఊరికే జోకాను)
@బృహఃస్పతి గారు, (హమ్మయ్య, మీ పేరు టైప్ చెయ్యటం వచ్చింది, అంటె, సగం తెలుగు టైప్ చెయ్యటం వచ్చినట్టె) చాలా థాంక్స్. నేను బ్లాగ్ రాయటానికి కొత్తే కాని, చదవటానికి కాదు. సొ, మీ ప్రిన్సిపాల్ గారి గురించి బాగానె తెలుసు :)
లేఖినినే వాడాల్సిన పనిల్యా!!
ఈడోలుక్కేయ్యండా!!
http://paatapaatalu.blogspot.com/2009/03/blog-post.html
ఇల్లాక్కూడా రాసవ్వతలేయొచ్చు.
చాల సరదాగా రాసారు ....చదువుతున్నంతసేపు నవ్వుతూనే వున్నాను ...మొన్ననే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ బోల్డన్ని చాకీలు (చాక్లెట్స్ )తెచ్చారు ...తింటూనే వున్నాను .
బాగున్నాయండి మీ అనకాపల్లి టూ అమెరికా కబుర్లు. :). చాలా సరదాగా ఉన్నాయి. మీ కబుర్లు చదవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. త్వరగా మరో పోస్టు వెయ్యండి మరి.
అయినా అమెరికా వెళ్ళిన పతీవోడూ అక్కడ చాక్లెట్లు తప్ప వేరే ఏమీ దొరకనట్టు, చీప్‌గా చాక్లెట్లు తెచ్చిపడేస్తే ఎలా? దానికి తగ్గట్టే ఉంటుంది మరి రెస్పాన్స్. :) :).
చాలా బాగా రాసారు ..మీ ప్రొఫైల్‌లో ఈ వాక్యం బావుంది.. I am an obsessive compulsive reader.
U.S.S.R అని మరొకటుందిలేండి అదే United States Of Srikakulam Rural :)
ఏదో దిక్కుమాలిన ప్రాస కోసం అనకాపల్లి టు అమెరికా అనో అమలాపురం టు అమెరికా అనో సినిమావాళ్ళు చేసినప్రయోగాలవి.ఏవూరి గొప్ప ఆవూరిది.అయినా విశాఖపట్నం వాళ్ళకు తప్ప అనకాపల్లి గొప్ప మరెవరికి బాగా తెలుస్తుందంటారు :)
మొదటి టపానా? బాగుంది. స్వాగతం.
@మురళి:
నాకు ఈటీవీ సుమన్ తెలుగు ప్రజల మీద పేల్చిన మొట్టమొదటి బాంబు గుర్తొచ్చింది. అదీ ఇదే పేరు కదా.
@రాజేంద్ర దేవరపల్లి:
ఇంతకీ మీదే ఊరు సార్. కాసేపు గుంటూరంటారు, చాలాసేపు విశాఖంటారు! ఇల్లరికపుటల్లుడుంగారు కాదు కదా ;-)
బాగుంది అనకాపల్లె బుల్లెమ్మ అమెరికా ప్రయాణపు ప్రారంభం. మేమందరం రడీ మరి, ప్లీజ్ ప్లీజ్ కొంచం మంచి గా చెప్పరా అమెరికా గురించి, అంటే అమెరికా లో వుంటున్న మా గురించి. ;-) ప్లీజ్ ఆ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చరా కళ్ళకు కష్టం గా వుంది చదవాలంటె. మార్చక పోయారా ఏమి చేస్తానో తెలుసా.............ఏమి చేస్తాము తప్పేది ఏమి వుంది అలానే చదువుతాము. :-(
@అబ్రకదబ్ర అబ్బే యంతమాత్రమూ కాదండి,ఏదో చదూకోటానికి వచ్చి ఇక్కడ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా అంతే.(పి ఎ పి వారి)ఇల్లరికం కాదు,భార్యాభర్తలు మాత్రమే :)
బావుంది :)
మొదటి పొస్టే అదిరింది. వైట్ బ్యాక్ గ్రవుండు మీద బ్లాక్ అక్షరాలు చదవడానికి ఈజి.
Chala baga rasarandi....office andaru velthunte manaki eppudu vasthuda ani eduru chusina roojulu guthuki vachhay.....
రూత్ గారు, సిగ్గు పడేవాళ్ళు నిజంగా ఉన్నారులేండి. 90% రూరల్ పాపులేషన్ ఉన్న దక్షిణ ఒరిస్సా నుంచి వచ్చిన మా నాన్న గారు తనది ఒరిస్సా అని కాకుండా ఆంధ్రా అని చెప్పుకునేవారు వరంగల్, కరీంనగర్ లలో పని చేసే రోజుల్లో.
@భాస్కర్ గారు, చూసానండి కాని ఆ టూల్ ఈఏ తో పనిచెయ్యదేమొ?
@చిన్ని గారు, :) నన్ను కూడా చిన్ని అనే అంటారు ఇంట్లొ. థాంక్స్
@ నాగ ఫ్రసాద్ గారు, ఐ హర్టెడ్! హర్టెడ్ అంతె!
@ ఉమా శంకర్ గారు, నిజంగానె, నేను చదవకుండా ఉండలేను. థాంక్స్.
@ రాజేంద్ర గారు, అవునండి, అస్సలు అనకాపల్లి గొప్పదనం మీద ఒక పెద్ద బ్లాగ్ రాయాలి!
@ అబ్రకదబ్ర గారు...... మీరు ఎద్దు కన్నుని కొట్టేసారు :) :) :) అవును, ఇ-సుమన్ గారి బుక్ పేరే నా మనసులో ఉన్నది కూడా....ఆ బుక్ నేను ఏ వందసార్లో చదివి ఉంటాను.
@ భావన గారు, కొత్త పాళి గారు, మంచు పల్లకి గారు, బుచ్చి బాబు గారు, అందరికీ చాలా చాలా వందనాలు. నేను అస్సలు అనుకో లేదు మొదటి సారే ఇంతమంది ప్రొత్సహిస్తారని. మీరు ఇచ్చిన సూచనలు, మార్పులు చెయ్యటానికి ట్రై చేస్తాను. ఇంకా కొత్త కదా.....
@ ప్రవీణ్ గారు, ఇదే కాదు, ఏ విషయం లోను నా తప్పు లేకపొతే నేను సిగ్గుపడనండి.
post అదిరింది..welcome
దిస్ టెంప్లెట్ ఈజ్ మోర్ బెటర్ దాన్ ప్రీవియస్!! తెలుగులో ఆంగ్లం టైపు సేయడం కష్టమే సుమా!!
హేవ్ పన్!!
అవును రూత్ గారు,మీరు రాయాల్సిందే మరి :)
వడ్డాది పాపయ్య గారి గురించి,కాలాతీత వ్యక్తులు నవలా రచయిత్రి శ్రీమతిశ్రీదేవి గారి గురించి,కుమ్మరి మేష్టారి గురించి,శంకరం గురించి,బొజ్జన్నకొండ గురించి,నూకాలమ్మ గురించి.. రాయాలి.అసలనకాపల్లి బెల్లం గురించి టన్నులటన్నులు రాయొచ్చు.అన్ని ఊళ్ళలో జనాభా పెరుగుతుంటే మీ ఊర్లో జనాభా ఎందుకు తగ్గుతుందో రాయొచ్చు,శారద నది గురించి రాయొచ్చు అబ్బో మీ ఊర్లో మాకు తెలీనివి మీకు మాత్రమే తెలిసినవీ బోలెడుంటాయి రాయండ్రాయండి :)
@ నేస్తం గారు, థాంక్స్.
@ భాస్కర్ గారు, ప్రస్తుతానికి లేఖిని తొ వెళ్దాం!
@ రాజేంద్ర గారు, అబ్బో, మీకు అనకాపల్లి గురించి నాకంటే ఎక్కువ తెలిసినట్టుంది. కాని అస్సలు సిసలు పాయింట్ ఏంటంటె, నాకు తెలిసి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనకాపల్లి వారు. ఈ ఒక్క విషయం చాలు అనకాపల్లి గొప్పదనం చెప్పటానికి. ఏమంటారు?
మీ ఊరి వాళ్ళ గురించి మీ అభిప్రాయాన్ని నేనెందుకు కాదంటాను కానీ,అసలు నేను చెప్పిన వాళ్ళ గురించి,స్థలాల గురించి రాయటం మొదలుపెట్టండి.అసలు విషయాలు మెల్లగా బయటకొస్తాయి.శుభస్య శీఘ్రం
Ruth గారు మీ బ్లాగు బహు బాగు.. చాలా తొందరగా చదివించేసారు keep going
టపాలు ఆదరగోడుతున్నావ్ . :)
Post a Comment