మా టీం లో అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ ఒక కామన్ ఎఫెక్టు ఉండేది. అది, బరువు తగ్గడం. మరి దేశం కాని దేశం లో, అసలే వంట సరిగ్గా రాకుండా, రోజూ బయట తినే అవకాశం లేక వాళ్ళంతా బక్కచిక్కిపోయి వెనక్కి వచ్చేవాళ్ళు. నేను మమూలుగానే BMI కి మైనస్ లో ఉంటాను, దాంతోటి అందరూ భయపెట్టడం మొదలుపెట్టారు వచ్చేసరికి నువ్వు మాయం ఐపోతావు, స్కెలిటన్ లా తయారౌతావు అని. నాకు మనసులో కొంచెం బెరుకు గానే ఉన్నా, సీనియర్స్ ఉన్నారులే అనే ధైర్యం తో ఫ్లైట్ ఎక్కేసాను. ప్రయాణంలో తిన్న తిండి గురించి ఎంత తక్కువ చెప్తె అంత మంచిది. మా పోర్ట్ ఒఫ్ ఎంట్రీ LA ఏర్పొర్ట్లో ఏమైనా తినాలని మా వాళ్ళంతా అన్నారు(మరి ఆఫీస్ డబ్బులిస్తుంది కదా). సరే, అక్కడో రెస్టారెంట్ ఉంటె వెళ్ళాం. నాకు సడెన్ గా కడుపులో తిప్పడం మొదలయింది. బాబోయ్ ఏంటీ కంపు?? అడిగాను. హ్మ్మ్ అమెరికాలో ఇంతే అలవాటయ్యే వరకు ఇలాగే ఉంటాది తర్వాత్తర్వాత నువ్వే సెట్ అయిపోతావులే అని చెపారు. అందరూ బర్గర్లు అవీ తింటుంటె, నేను మాత్రం వీలైనంత దూరంలో కూర్చుని ఐస్ క్రీం తిని సరిపెట్టాను.
సియాటిల్ చేరేసరికి అర్ధరాత్రయ్యింది. తిన్నగా తెలిసిన వాళ్ళింటికెళ్ళాము. తీరా అక్కడికెళ్ళేసరికి తెలిసింది వాళ్ళంతా లాంగ్ వీకెండుకి ఏదొ ట్రిప్ కెళ్ళారంట. ఫోన్ చేస్తే మీరు వొండుకొని తినేయండి మేం వచ్చెసరికి టైం పడుతుంది అని చెప్పారు. అందరం పిచ్చపిచ్చగా అలసిపోయి ఉన్నాం పోనీ రేపు ఉదయాన్నే తినొచ్చులే...నేను అస్సలు ఒప్పుకోను! మీరంతా ఏదొ గడ్డి ఐనా తిన్నారు, నేను మాడిపోతున్నాను అని తీవ్రంగా వ్యతిరేకించేసరికి సరేలే అని బియ్యం మాత్రం కుక్కర్లో పోసి, మాతో వచ్చిన అబ్బాయిని అడిగాం పచ్చళ్ళు ఏమైనా తెచ్చావా అని. తెచ్చావా ఏంటి? ఒక చెకిన్ బేగ్ మొత్తం పచ్చళ్ళే అని చూపించాడు. ఏంటిది? ఇక్కడ గాని పచ్చళ్ళ కొట్టు పెడదామనుకుంటున్నవా అంటె, హి హి కాదు, ఇక్కడున్న మనవాళ్ళ ఆర్డర్ ఇది అని చెప్పాడు(అక్షరాలా 20 కేజీల అచ్చ తెలుగు పచ్చళ్ళు). కుక్కర్ అవ్వగానే వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తిన్నాక గాని శాంతించలేదు నా ఆత్మా సీత.
రెండ్రోజుల్లో ఇల్లు, ఆఫీస్ అన్ని సెట్లయ్యాయి. ఇండీయా నుంచి లిస్ట్ ప్రకారం తెచ్చుకున్న ఉప్పులూ పప్పులూ అన్నీ సర్దుకున్నాం. రోజుకిద్దరు చొప్పున వంట కి వంతులు వేసుకున్నాము. నేను హిమ ఒక టీం. మా వంతు రోజున ఆఫీస్ నుంచి ఆత్రం గా ఇంటికి వచ్చాను. హిమ, ఏం వండుదాం? హ్మ్మ్... ఆలూ?(నా ఉద్దేశం ప్రకారం ఆలూ వండటం అన్నింటికన్నా సులువు). సరే, నేను రెడీ అయ్యి వచ్చేలోపు ఆలూ కట్ చేసి ఉంచు అని హిమ లోపలికి వెళ్ళి, ఒక పది నిముషాల్లో తిరిగి వచ్చింది. ఏవీ ఆలూ అని అడిగింది. నేను ఉత్సాహంగా చూపించాను. బాగా కడిగిన అరడజను ఆలూలు, ఇంకా ఒక తళ తళా మెరిసేలా నునుపుగా చెక్కుతీసిన ఆలూ. ఏంటి ఇప్పటివరకు నువ్వు చేసింది ఇదా?? మరి నాకు వంట రాదు కదా, నేను కొంచెం మెల్ల మెల్లగా చేస్తుంటాను అన్నీ అని చెప్పాను. పైగా నాకు తెగ చాదస్తం, కడిగిందే కడుగుతూ, తొక్కలు ఎక్కడా ఒక్క చిన్న పిసరు కూడా మిగలకుండా పీల్ చెయ్యడం, అన్ని ముక్కలూ ఒకే సైజు, షేపులో వచ్చేలా కట్ చెయ్యటం ఇలా.... ఇక అప్పటికే ఆకలితో మాడిపొతున్న మావాళ్ళంతా తీవ్రంగా అభ్యంతరం తెలియజేసాక, ఇంక నా వల్ల కాదులే అని, నన్ను బియ్యం కడగమని, తనే చేసింది ఆలూ. నేను బియ్యం కొలిచి, కడిగేలోపు ఆలూ కూర ఐపోయింది. ఇక జనాలకి అర్ధం అయింది నా వంట ప్రతాపం. నా వంతు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు వాలంటరీ గా హెల్ప్ చేసేవాళ్ళు. నేను బలవంతం గా చేస్తానన్నా చేయనిచ్చేవారు కాదు.
అసలు నన్నంతలా ఆడిపోసుకుంటారు గాని, మా వాళ్ళంతా వంటలో అంతంత మాత్రమే. హిమ, నీలు మాత్రం బాగానే గరిట తిప్పగలరు. ఇక మిగతా వాళ్ళ వంటలు రక రకాలుగా ఉండేవి. మచ్చుకి,
జాంకాయ్- చేమదుంపల ఫ్రై: ముందు చేమదుంపలని తొక్కతీసి ఉడకబెట్టాలి. జాంకాయ్, చేమదుంపలు ఉడకపెట్టాక తొక్కలు తియ్యాలి అని నాకు అనుమానంగా ఉంది. చీ నువ్వు కూడా నాకు చెప్పేస్తున్నావా?? నేను సీనియర్ని గుర్తుంచుకొ! సరే, తొక్కతీసి ఉడకపెట్టిన చేమదుంపలు కొయ్యటం మీరే ఊహించుకోండి.
ఆరతి- కందిపప్పు: ముందు పప్పు కుక్కర్లో పెట్టు...అరే, ఎన్ని విసిల్స్ వచ్చినా ఉడకట్లేదేంటీ??? కందిపప్పు బదులు సెనగపప్పు పెడితే ఇలాగే అవుతాది.
గాయ్- .....పేరు తెలీదు: క్యా బనా రహీ హొ? అరె, ఫ్రిజ్ మే జో భి హో వో సబ్. అంటె కలిపికొట్టరా కావేటి రంగా అని, అన్ని కూరగాయలూ కలిపి ఒక పేకెట్ మసాలా వేసి వండెస్తుంది అంతే. తిండం మానడం మన ఇష్టం.
జాంకాయ్+గాయ్ - కేక్: రెడీ మేడ్ మిక్స్ తెచ్చి, కేక్ బౌల్ లేనందువల్ల ఒక ప్లేట్లో వేసి బేక్ చేసారు. కేక్ బదులు వెనిల్ల కేక్ బిస్కట్లు తిన్నాం.
కాని ఏది ఏమైనా, ఎలా వచ్చినా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. వీకెండ్స్ కి పక్క రూం అమ్మాయిలు అందరం కలిసి మరీ వండుకునే వాళ్ళం. అప్పటి వరకు అమీర్‌పేట్ హాస్టల్ లో ఉన్న నాకైతే రొజూ పండగే.
ఇక అక్కడ ఉండే మనవాళ్ళ అతిధి సత్కారం గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలే మేం వెళ్ళింది పండగల సీజన్. వినాయక చవితి నెక్స్ట్ రోజు దిగామనుకుంటా. ఇక ఏదొ ఒక పండగ రావటం, మమ్మల్ని వాళ్ళు భోజనానికి పిలవడం. దీపావళి లాంటి నాకు తెలిసిన పండగలే కాకుండా, నేను ఇండియాలో ఎప్పుడూ వినని కార్తీక పౌర్ణమి లాంటి పండగలు కూడా భేషుగ్గా చేసుకునే వాళ్ళు. మళ్ళి మెనులో ఎక్కడా తగ్గడం ఉండేది కాదు. అయ్యొ, ఎలాగు ఇండియా లో లేము, కనీసం వంటకాలైనా సరిగ్గా చేసుకొకపోతే ఎలా అని, పులిహోర తో మొదలెట్టి, గారెలు, బూరెలు, పూరీలు, బొబ్బట్లు, చక్రపొంగలి, పాయసం, పరమాన్నం(బెల్లం తో) ఇంకా కనీసం నాలుగు రకాల వేపుళ్ళు, కూరలు అబ్బో..... మళ్ళీ, "హూం ఇదే ఇండియాలో ఐతేనా ఎంత బాగా చేసుకునే వాళ్ళమో " అనే స్టాండర్డ్ డైలాగ్ మాత్రం తప్పనిసరి. నేను కూడా పనిలో పనిగా " హూం ఇదే ఇండియాలో ఐతే అసలు పండగనే తెలీకుండా మా హాస్టల్ ఆంటీ చేసే ఉప్పులేని చప్పిడి ఫుడ్డొ, లేక ఏదొ హోటలో జంక్ ఫుడ్డో తినే దాన్ని" అని డైలాగ్ వేసుకునేదాన్ని. మొత్తానికి నా అమెరికా మూడు నెలల్లో నేను నేర్చుకున్నది ఏమైనా ఉంది అంటె అది వంట చెయ్యడం అని సగర్వంగా చెప్తాను. మా రూం మేట్స్ కొంతమంది శాకాహారులవడం వల్ల ఓన్లీ వెజిటేరియన్ వంటలే నేర్చుకున్నా, నాకు పెళ్ళయ్యే వరకు నేను ఆ వంట మీదే బతికాను. ఎందుకంటె, నేను ఇండియా వచ్చేసిన తర్వాత ఆ హాస్టల్ వదిలేసి ఫ్లాట్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఉండడానికి, నా అమెరికా అనుభవం వల్ల, నాకు పర్మీషన్ ఇచ్చారు మమ్మీ.
సరే, ఇక వెళ్ళిపొయే టైం వచ్చింది, అందరం సూట్‌కేసులు సర్దుతున్నాం. ఒక వేయింగ్ మిషన్ తెచ్చాం (ఇలాంటివన్ని అక్కడ సెట్లైన మన వాళ్ళదగ్గర తప్పనిసరిగా ఉంటాయి). అందరం సూట్‌కేసులు వెయిట్ చెక్ చేస్తున్నాం, ఒక కేజీ ఎక్కువైనా పరవాలేదు కాని, ఒక్క గ్రాము కూడా తక్కువ ఉండకూడదు అనేది మా ప్రయత్నం. జాంకాయ్, నువ్వు కూడా నించో చూద్దాం సరదాగా అన్నాను. జాంకాయ్ ఎక్కింది, హెయ్ xyz ఉన్నావు... వెంటనే పక్కనే ఉన్న హిమ కేజీల్లోకి కన్వర్ట్ చేసి చెప్పింది(అక్కడన్నీ పౌండ్స్ కదా). ఏంటీ, మళ్ళీ చూడు, జాంకాయ్ మళ్ళీ ఎక్కింది, సేం నంబర్. అరె, ఇంత తేడా ఎలా? హిమా నువ్వు ఎక్కు చూద్దాం. ఇంకొ abc వచ్చింది. తనుకూడా నమ్మలేదు. వేయింగ్ మిషన్ తప్పేమొ! ఒక్కొక్కళ్ళం ఎక్కి చూసుకున్నాం. డౌట్ లేదు ఖచ్చితంగా మిషన్ తప్పు రీడింగ్ చూపిస్తుంది. లేకపొతె అందరి వెయిట్ ఎందుకు తేడా వస్తుంది? సరె, ఇప్పుడు అవన్నీ పట్టించుకోటానికి టైం లేదు. ఆఖరు నిముషం హడావిడిలో అంత పట్టించుకోక పోయినా అందరి మన్సుల్లోను తొలుస్తూనే ఉన్నాయి ఆ నంబర్లు.
ఆఫీస్ కి రాగానే టీం మేట్స్ అంతా వచ్చారు, కుశలపశ్నలు ఐనతర్వాత అందరూ కలిసికట్టుగా అన్నరు...హి హి అమెరికా నీకు బాగా పడినట్టుంది (మనసులో- దుర్మార్గుల్లరా దిష్టి కొడతారా! చీ)
ఇంటికి వచ్చెసరికి మమ్మీ, డాడీ : చిన్నితల్లీ, ఇప్పుడు కొంచెం బాగున్నావమ్మా! (అదేంటి మనం ఎలా ఉన్నా ఇంట్లొ వాళ్ళకి చిక్కిపోయినట్లుగా కనిపించాలికదా?)
మా పెంటమ్మ: సిన్నీతల్లి సిన్న వొల్లు సేసింది కందండి అమ్మగోరు.... (పెంటమ్మా, నీకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేనట్టుంది, డాక్టర్ దగ్గరకి వెళ్ళు)
మా బాబీ గాడు: ఏంటక్కా ఇలా సిలిండర్ లా అయ్యావ్?? (పోరా వెధవా)
పక్కింటి మణాంటీ: చిన్నీ! ఏంటి పెళ్ళి కళ వచ్చేసింది అమెరికా వెళ్ళొచ్చేసరికి, బుగ్గలొచ్చాయ్, రంగు తేలావ్? ఏంటి కధ??? (ఆంటీ నాకు పనుంది మళ్ళీ వస్తానేం)
మా కసిన్ గురుద్వారా కి వచ్చింది నన్ను పిక్ అప్ చేసుకోడానికి. నన్ను అంతదూరం నుంచి చూడగానే.......... ఒస్సే పందీ !!!!.....హ హ హా!!!.....( చాలు ఇంక ఆపు. నీ పోయింట్ నాకు అర్ధం అయింది. మనం ఇంక వేరే విషయాలు మాట్లాడు కుందాం! )
***** మీకు కూడా అర్ధం అయిందనుకుంటా పోయింట్. మనం కూడా వేరే విషయాలు మాట్లాడుకుందాం నెక్స్ట్ టైం.

10 comments:
జాంకాయ-చేమదుంప వేపుడు.. మొదటిసారి చదివినప్పుడు భలే అపార్ధం చేసుకున్నానండి.. జాంకాయ మీ ఫ్రెండ్ అని తర్వాత అర్ధమయ్యింది.. మీరు మరిన్ని దేశాలు చూడాలని కోరిక.. అప్పుడు మేమింకా చాలా చదవొచ్చు కదా...
హ హ హ ! బాగుంది !
@ మురళి గారు, హ హ.. నేను కూడా అనుకున్నానండి ఎవరైనా తికమక పడతారేమో అని. కాని మన తెలుగు బ్లాగరులు తెలివైన వాళ్ళుకదా, అర్ధం చేసుకుంటారని వదిలేసాను.
ఒక్క విషయం, మీకు ఈ టపా గురించి ఎలా తెలిసింది? నాకెందుకో జల్లెడలొ కనిపించలేదు మరి.
@ శ్రావ్య, థాంకూ :)
బాగున్నాయండి మీ అమెరికా విశేషాలు :)
హ హ హ అమెరికా లో ఎలాంటి వాళ్ళు కూడా లావు ఐపోతారు ఇక్కడి గాలి తిండి అలాంటివి మరి. అరే కరక్ట్ గా చెప్పేరే మేము అనుకునే మాటలు 'హుం ఇండియా లో ఐతే ఇంకా ఎంతో బాగా చేసుకునే వాళ్ళము' అని. ఐతే మీరు ఎంత weight పెరిగినట్లో.. ;-)
@ నేస్తం గారు, క్షమించాలి చాలాఅలస్యంగా థాంకూ చెప్తున్నందుకు :)
@ భావన గారు, హ హ... చూసారా ఎలా కనిపెట్టేసానొ. ఐనా ఇల మీరు బ్లాగ్ ముఖంగా అడిగేస్తే ఎలా అండీ? అస్సలే ఈ కాలంలో అబ్బాయిల హైటు అమ్మాయిల weight అడ్డకూడదని......
adedo cinemalo sreelaxmi...okkasari matalu raagane... chinnappati vishayallani cheppi brahmmi ni chavagottiddi ... a scene gurthochhindi.. ee blog chadivithe
:D
మీకు అమెరికా బాగా పడిందన్న మాట .. ఓ సారీ సారీ, మనం వేరే విషయాలు మాట్లాడుకోవాలి కదూ?
కొత్తపాళీ గారు, చాలా థాంక్స్ ఇలా పాత టపాలు కూడా తిరగేస్తున్నందుకు.
అమ్మలూ, భగవద్గీతలో శ్రికృష్ణుడేం చెప్పాడో సెర్మనాందిమౌంట్లో జీసస్ కూడా అదే చెప్పాడు .. ఈస్టర్ రోజున నేనబద్ధం చెబుతానా? "అమెరికా ఆపశ్చ గాలియోహ్ ఫుడ్డుశ్చ వొళ్ళుః: ఫ్రై బాయిల్ మసాలా సర్వం ఓవర్ వెయిటువః" అనగా .. అమెరికా గాలి నీరు తగిలినంత మాత్రమునే అస్తి పంజరము సైతము సిలుకు స్మిత (విద్యా బాలన్) వలె కళకళలాడును. వేపిన, ఉడికించిన, మసాలా వేసి వొండిన, ఎట్లు వొండిననూ బరువు పెరుగుట తప్పదు!"
Post a Comment